News December 4, 2024

MBNR: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్

image

దివ్యాంగుల సంక్షేమ కోసం ప్రభుత్వం సంక్షేమ కార్య క్రమాలు అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం అంబేడ్కర్ అడిటోరియంలో ప్రపంచ దివ్యాంగులదినోత్సవ వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆమె సమాన అవకాశాలు, గౌరవంగా జీవించేందుకు కేంద్ర ప్రభుత్వం దివ్యాంగుల హక్కుల చట్టం 2016 అమలు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News February 5, 2025

NGKL: ఘోర రోడ్డు ప్రమాదం.. వివాహిత మృతి

image

ఫంక్షన్‌కి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు చెందిన ఘటన NGKL మండలంలోని చందుబట్ల గేటు వద్ద మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. పెంట్లవెల్లికి చెందిన పుష్పలత(47) తన భర్త, కూతురితో కలిసి HYDలో ఫంక్షన్‌కి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో చందుబట్ల గేటు వద్ద కారు కల్వర్టును ఢీకొట్టగా.. పుష్పలత అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.

News February 5, 2025

MBNR: వివాహితపై లైంగిక దాడి

image

MBNR జిల్లా నవాబ్‌పేట మండలంలోని ఓ తండాకు చెందిన వివాహితపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గిరిజనతండాకు చెందిన వివాహిత పొలానికెళ్లి వస్తుండగా.. శంకర్‌నాయక్ ఆమెపై లైంగిక దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News February 5, 2025

MBNR: ‘క్షయ వ్యాధి పరీక్షల సంఖ్యను పెంచండి’

image

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా చేయాలని పరీక్షల సంఖ్యను వెంటనే పెంచాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్షయ వ్యాధిగ్రస్తులను ముందుగా గుర్తించేందుకు అవసరమైన ఎక్స్ రే లను పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ కృష్ణ పాల్గొన్నారు.

error: Content is protected !!