News July 25, 2024

MBNR: ప్రభుత్వ పాఠశాలలకు నిధుల కొరత

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 3,215 ప్రభుత్వ పాఠశాలల్లో.. 3,01,880 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సుద్ధముక్క, విద్యార్థుల హాజరు పుస్తకాలు, రిజిస్టర్లు, చీపుర్లు, మరుగుదొడ్ల క్లీనింగ్ రసాయనాలు, ప్రయోగశాల సామాగ్రి వంటి తదితర సామాగ్రి కొనుగోలుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో HM ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర ఖర్చులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని పేట DEO అబ్దుల్ ఘని తెలిపారు.

Similar News

News December 5, 2024

మిడ్జిల్: పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

image

విద్యార్థులకు పాఠ్యాంశాలు అర్థమయ్యే రీతిలో బోధించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. మిడ్జిల్ మండలం బోయిన్‌పల్లి జెడ్‌పి ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి బుధవారం తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ మధ్యాహ్న భోజనం, పాఠశాల పరిసరాలు పరిశీలించారు. బియ్యం,ఆహార పదార్థాలు పరిశీలించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతతో అందించాలని, ఎటువంటి ఫిర్యాదులు రానివ్వకూడదని సూచించారు.

News December 5, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔రేపు పుష్ప-2 రిలీజ్.. మొదలైన హంగామా✔NGKL:నూతన డీఈవోగా రమేష్ కుమార్✔ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న చలి✔NGKL: బైక్‌కు నిప్పు పెట్టిన దుండగులు✔అడ్డాకుల: ట్రాక్టర్, డీసీఎం ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు✔గద్వాలలో రేపు చేనేత సంబరాలు✔కనీస వేతనం చెల్లించాలని ఆశ వర్కర్ల ధర్నా✔నియామక పత్రాలు అందుకున్న గ్రూప్-4 అభ్యర్థులు✔పలువురికి CMRF చెక్కులు అందజేత✔మధ్యాహ్న భోజనం.. తనిఖీ చేసిన ఎమ్మెల్యేలు

News December 4, 2024

వనపర్తి: వ్యాపారిని హత్య చేసిన తోటి వ్యాపారి: SP

image

నగల <<14783426>>వ్యాపారి హత్య<<>> కేసులో కీలక విషయాలు వెలుగుచూశాయి. వనపర్తి SP తెలిపిన వివరాలు.. గుంటూరు జిల్లాకు చెందిన శేషు(43) బంగారం, వెండి ఆభరణాలను హోల్‌సేల్‌ ధరలకు సరఫరా చేసేవాడు. బిజినేపల్లిలో గోల్డ్ షాపు నడుపుతున్న దీపక్‌మాలి(రాజస్థాన్)కు గత నెలలో కొన్ని నగలు ఇచ్చాడు. ఈ క్రమంలో తన అప్పు తీర్చుకునేందుకు శేషు వద్ద నగలు, డబ్బు కొట్టేయాలనుకున్నాడు. తమ్ముడితో కలిసి ప్లాన్ ప్రకారం NOV 21న శేషును హత్య చేశారు.