News August 12, 2024

MBNR: ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక ఫోకస్

image

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 3,225 ప్రభుత్వ పాఠశాలల ఉన్నాయి. వీటిలో మరుగుదొడ్లు, తరగతి గదులు, పాఠశాల ఆవరణలో పరిశుభ్రత, మొక్కల సంరక్షణ వంటి అంశాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రాంట్ ఇవ్వనుంది. పాఠశాలల నిర్వహణ కోసం ఇప్పటికే సమగ్ర శిక్ష అభియాన్ కింద కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ ను ప్రభుత్వం అందిస్తుంది. వాటికి అదనంగా స్కూల్ ఫెసిలిటీ మెయింటెన్స్ గ్రాంట్ కూడా ఈ నెల నుంచి ఇవ్వనున్నారు.

Similar News

News January 7, 2026

MBNR: పీఎంశ్రీ క్రీడా పోటీలు.. విజేతలు వీరే!

image

మహబూబ్ నగర్ జిల్లాలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు. వివరాలు ఇలా!!
✒ కబడ్డీ (బాలుర)
1st- బాదేపల్లి, 2nd- గార్లపాడు
✒ కబడ్డీ (బాలికల)
1st- బాలానగర్, 2nd- వాపుల
✒ వాలీబాల్ (బాలుర)
విజేత- బాదేపల్లి, రన్నర్‌గా- వేముల
✒ వాలీబాల్ (బాలికల)
విజేత- బాలానగర్ (గురుకుల), రన్నర్‌గా-సీసీ కుంట(KGBV)

News January 7, 2026

MBNR: T20 లీగ్.. పాలమూరు విజయం

image

HCA ఆధ్వర్యంలో నిర్వహించిన ‘T20 కాకా స్మారక క్రికెట్ లీగ్’లో పాలమూరు ఘన విజయం సాధించింది. సిద్దిపేటలో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన WGL జట్టు 20 ఓవర్లలో 142/7 పరుగులు చేసింది. MBNR జట్టు 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. MBNR జట్టు ఆటగాడు అబ్దుల్ రాఫె-79* పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచాడు. వారిని MDCA ప్రధాన కార్యదర్శి రాజశేఖ్, కోచ్‌లు అభినందించారు.

News January 6, 2026

MBNR: చైనా మంజా విక్రయిస్తే ఫోన్ చేయండి: SP

image

ఎవరైనా చైనా మంజా విక్రయాలు లేదా వినియోగం గమనించినట్లయితే వెంటనే డయల్-100కు లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712659360కి సమాచారం ఇవ్వాలని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. జిల్లా పరిధిలో ఎక్కడా చైనా మంజా విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, రాబోయే సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని, జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక తనిఖీలు వెల్లడించారు.