News July 10, 2024
MBNR: ప్రాజెక్ట్ కింద భూసేకరణ చెల్లింపులను తక్షణమే చేయాలి: ఎంపీ

ప్రాజెక్ట్ కింద భూసేకరణ చెల్లింపులను తక్షణమే చేయాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సీఎం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ.. జూరాల నుంచి పాలమూరు-రంగారెడ్డికి నీరు తీసుకుంటేనే PRSI పథకం పూర్తవుతుంది. NRPTలో టెక్స్టైల్ పార్కు, గద్వాలలో హ్యాండ్లూమ్ పార్కు, ఉమ్మడి MBNR జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆమె అన్నారు.
Similar News
News October 30, 2025
MBNR: ‘బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలి’

పాలమూరు విశ్వవిద్యాలయం పీజీ కళాశాలలో గురువారం జరిగిన బీసీల కార్యాచరణ సభకు ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ కుమారస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీసీల హక్కులు, సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం తీసుకున్న బీసీ రిజర్వేషన్ల బిల్లుకు చట్టబద్ధత కల్పించేందుకు దానిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
News October 30, 2025
PU: ‘ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి’

విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని పీయూ ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు బత్తిని రాము డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 4 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని, వాటిని విడతలవారీగా విడుదల చేసి పేద విద్యార్థులను ఆదుకోవాలని కోరుతూ గురువారం పాలమూరు విశ్వవిద్యాలయం ముఖద్వారం ఎదుట నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు శేఖర్ పాల్గొన్నారు.
News October 30, 2025
MBNR: వార్షిక పరీక్షకు ‘యూ-డైస్ ఆపార్’ తప్పనిసరి: డీఐఈవో

ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణపై మహబూబ్నగర్ జిల్లాలోని జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్తో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి(డీఐఈవో) కౌసర్ జహాన్ మాట్లాడుతూ.. విద్యార్థులకు యూడైస్, ఆపార్ జనరేట్ చేస్తేనే వార్షిక పరీక్షకు అర్హులని, లేనిపక్షంలో అనర్హులు అవుతారని స్పష్టం చేశారు. పరీక్షలు సీసీ కెమెరాల నిఘాలో జరుగుతాయని చెప్పారు.


