News July 31, 2024
MBNR: ప్రాణాలు తీస్తోన్న తీగలు.. జర జాగ్రత్త..!
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య ఏటికేడు పెరుగుతుంది. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకపోవడంతో విద్యుత్ షాక్‌తో మనుషులతో పాటు పశువులు మృత్యువాత పడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 2020లో 80 మంది మనుషులు, 172 పశువులు మృత్యువాత పడ్డాయి. 2021లో 85 మంది మనుషులు, 196 పశువులు, 2022లో 72 మంది మనుషులు, 257 పశువులు కరెంట్ షాక్‌తో చనిపోయాయి.
Similar News
News December 5, 2024
మిడ్జిల్: పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
విద్యార్థులకు పాఠ్యాంశాలు అర్థమయ్యే రీతిలో బోధించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. మిడ్జిల్ మండలం బోయిన్‌పల్లి జెడ్‌పి ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి బుధవారం తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ మధ్యాహ్న భోజనం, పాఠశాల పరిసరాలు పరిశీలించారు. బియ్యం,ఆహార పదార్థాలు పరిశీలించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతతో అందించాలని, ఎటువంటి ఫిర్యాదులు రానివ్వకూడదని సూచించారు.
News December 5, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!
✔రేపు పుష్ప-2 రిలీజ్.. మొదలైన హంగామా✔NGKL:నూతన డీఈవోగా రమేష్ కుమార్✔ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న చలి✔NGKL: బైక్‌కు నిప్పు పెట్టిన దుండగులు✔అడ్డాకుల: ట్రాక్టర్, డీసీఎం ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు✔గద్వాలలో రేపు చేనేత సంబరాలు✔కనీస వేతనం చెల్లించాలని ఆశ వర్కర్ల ధర్నా✔నియామక పత్రాలు అందుకున్న గ్రూప్-4 అభ్యర్థులు✔పలువురికి CMRF చెక్కులు అందజేత✔మధ్యాహ్న భోజనం.. తనిఖీ చేసిన ఎమ్మెల్యేలు
News December 4, 2024
వనపర్తి: వ్యాపారిని హత్య చేసిన తోటి వ్యాపారి: SP
నగల <<14783426>>వ్యాపారి హత్య<<>> కేసులో కీలక విషయాలు వెలుగుచూశాయి. వనపర్తి SP తెలిపిన వివరాలు.. గుంటూరు జిల్లాకు చెందిన శేషు(43) బంగారం, వెండి ఆభరణాలను హోల్‌సేల్ ధరలకు సరఫరా చేసేవాడు. బిజినేపల్లిలో గోల్డ్ షాపు నడుపుతున్న దీపక్‌మాలి(రాజస్థాన్)కు గత నెలలో కొన్ని నగలు ఇచ్చాడు. ఈ క్రమంలో తన అప్పు తీర్చుకునేందుకు శేషు వద్ద నగలు, డబ్బు కొట్టేయాలనుకున్నాడు. తమ్ముడితో కలిసి ప్లాన్ ప్రకారం NOV 21న శేషును హత్య చేశారు.