News October 11, 2024

MBNR : ప్రారంభంలో పత్తి ధర అదుర్స్.. తర్వాత డమాల్ !

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో వివిధ పంటల సాగులో పత్తిదే అగ్రస్థానం. ఉమ్మడి జిల్లాల్లో 9.50 లక్షల ఎకరాల వరకు రైతులు పత్తి సాగు చేశారు. ప్రస్తుతం ధర రూ.6 వేలు నుంచి రూ.6,500 వరకు పలుకుతుంది. పత్తి ధర ప్రారంభంలో రూ.8,100 ధర ఉండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా పడిపోతున్న ధరలను చూసి రైతులు అమ్మకాలు జరపకుండా ఇంట్లో నిల్వ ఉంటుకుంటున్నారు. ప్రభుత్వం పత్తి ధరను పెంచాలని కోరుతున్నారు.

Similar News

News November 18, 2025

బాలానగర్: ఫోన్‌పే చేస్తే.. ఖాతాలో రూ.28 వేలు మాయం

image

బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కిరాణా షాపులో ఫోన్‌పే ద్వారా రూ.1,260 పంపగా.. కొద్దిసేపటికి అతని ఖాతాలో ఉన్న రూ.28 వేలు మాయమయ్యాయి. దీంతో అవాక్కైన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై కేసు నమోదు చేశారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఎస్సై సూచించారు.

News November 17, 2025

బాలానగర్‌లో 9.9 ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రత రోజుకు పెరిగిపోతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలానగర్‌లో 9.9 డిగ్రీల అత్యంత ఉష్ణోగ్రత నమోదయింది. రాజాపూర్ 10.2, గండీడ్ మండలం సల్కర్ పేట, మిడ్జిల్ 10.5, హన్వాడ 11.3 కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 11.4, భూత్పూర్ 11.6, కోయిలకొండ మండలం పారుపల్లి 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.