News January 18, 2025

MBNR: ప్రేమను ఒప్పుకోలేదని యువతి ఆత్మహత్య

image

మహ్మదాబాద్ మండలం ధర్మాపూర్‌కు చెందిన పెద్దలు యువతి ప్రేమను కాదన్నారని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాలిలా.. MBNRలోని ఓ కళాశాలలో నర్సింగ్ చదువుతున్న గ్రామానికి చెందిన నవనీత(19) ఓ యువకుడిని ప్రేమించింది. విషయం తెలిసి యువతి ఇంట్లో వారు అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News November 12, 2025

MBNR: చెస్ ఎంపికలకు 250 మంది క్రీడాకారుల హాజరు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14, 17, 19 బాల, బాలికల విభాగాల్లో చెస్ ఎంపికలు నిర్వహించారు. ఎస్‌జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్. శారదాబాయి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి 250 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఎంపికైన వారిని త్వరలో రాష్ట్రస్థాయిలో జరిగే క్రీడా పోటీలకు పంపిస్తామని తెలిపారు. పీడీలు రామ్, వేణుగోపాల్ పాల్గొన్నారు.

News November 12, 2025

MBNR: తగ్గిన ఉష్ణోగ్రతలు.. పెరిగిన చలి

image

మహబూబ్‌నగర్ జిల్లాల్లో గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి తీవ్రత పెరిగింది. దీంతో ఉదయం వేళ పొలాల వద్దకు వెళ్లే రైతులు, కంపెనీలో పనిచేసే కార్మికులు, పాఠశాల, కళాశాలకు వెళ్లే విద్యార్థులు చలితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలానగర్ 14.3, మిడ్జిల్ 14.5, రాజాపూర్ 14.6, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 15.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

News November 12, 2025

MBNR: ‘కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి’

image

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇంకా ప్రారంభించని గ్రామాలలో వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుండి సంబంధిత శాఖల అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, టెంట్, బ్యానర్ వంటి కనీస వసతులు తప్పనిసరిగా కల్పించాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు.