News January 18, 2025

MBNR: ప్రేమను ఒప్పుకోలేదని యువతి ఆత్మహత్య

image

మహ్మదాబాద్ మండలం ధర్మాపూర్‌కు చెందిన పెద్దలు యువతి ప్రేమను కాదన్నారని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాలిలా.. MBNRలోని ఓ కళాశాలలో నర్సింగ్ చదువుతున్న గ్రామానికి చెందిన నవనీత(19) ఓ యువకుడిని ప్రేమించింది. విషయం తెలిసి యువతి ఇంట్లో వారు అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News February 18, 2025

MBNR: సద్వినియోగం చేసుకోండి: DIEO

image

ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకాని విద్యార్థులకు మరోసారి పరీక్ష నిర్వహించడానికి అవకాశం కల్పించినట్లు DIEO కౌసర్ జహాన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయోగ పరీక్షలను ఈనెల 18 నుంచి 21 వరకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గర్ల్స్ జూనియర్ కళాశాలలో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. హాజరుకాని విద్యార్థులకు ఇది ఒక సువర్ణ అవకాశమని వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News February 17, 2025

పీయూ PG పరీక్షలు.. 91 మంది గైర్హాజరు

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్ & మూడవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షల్లో 1945 మందికి గాను..1854 మంది విద్యార్థులు హాజరయ్యారని, 91 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పరీక్షల నియంత్రణ అధికారి డా.రాజకుమార్ తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో పరీక్షలను పకడ్బందీగా ఏర్పాటు చేశామన్నారు.

News February 17, 2025

ఉమ్మడి పాలమూరులో బీజేపీ జెండా ఎగరాలి: డీకే అరుణ

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి బీజేపీ జెండా ఎగురవేయాలని ఎంపీ డీకే అరుణ సోమవారం అన్నారు. మూసాపేట మండల కేంద్రంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఎంపీ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో BRS, కాంగ్రెస్‌ల వైఫల్యాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మూసాపేట, తుంకిల్ పూర్, సంకలమద్ది గ్రామాల నుంచి 100 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు.

error: Content is protected !!