News March 23, 2024
MBNR: ప్రేమ పెళ్లి.. ఒకరోజు ముందు లవర్ దుర్మరణం

పెళ్లికి ఒకరోజు ముందు ప్రియుడు మృతి చెందాడు. నాగర్కర్నూల్ వాసి శంకర్, నిజామాబాద్కు చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఈనెల 20న పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. ఊరెళ్లేందుకు 19న HYDలో అమ్మాయిని బస్సెక్కించి.. తాను బైక్పై బయల్దేరాడు. కందుకూరులో కారు ఢీకొని శంకర్ గాయపడగా.. అదే రూట్లో వస్తున్న ప్రేయసి గమనించి బస్ దిగేసింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శంకర్ చనిపోవడం బాధాకరం.
Similar News
News October 17, 2025
పాలమూరు యూనివర్శిటీ వీసీగా ఏడాది పూర్తి

పాలమూరు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ (వీసీ) ప్రొఫెసర్ జి.ఎన్.శ్రీనివాస్ ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తైంది. ఈ ఏడాదిలో వర్శిటీ విద్యా, పరిపాలనా రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించింది. వీసీ బాధ్యతలు చేపట్టిన వెంటనే నాక్ (NAAC) గ్రేడింగ్కు వెళ్లడం, లా కాలేజ్, ఇంజినీరింగ్ కాలేజీలను స్థాపించడం వంటి కీలక చర్యలు చేపట్టారు. ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఏడాది 100% అడ్మిషన్లు జరిగాయి.
News October 17, 2025
కురుమూర్తి బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరణ

దేవరకద్ర నియోజకవర్గం కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు శ్రీనివాసరెడ్డి, మధుసూదన్ రెడ్డి, వీర్లపల్లి శంకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించబోతున్నామని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వెల్లడించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
News October 17, 2025
‘ఏక్ పేడ్ మా కే నామ్’.. విస్తరించండి: గవర్నర్

విద్యార్థులు ఒక్కొక్కరు కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలి పీయూ ఛాన్సలర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. పీయూలో నిర్వహించిన స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. ‘స్నాతకోత్సవం అనేది కేవలం పట్టాల ప్రదాన వేడుక మాత్రమే కాదు, విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల సేవ, తల్లిదండ్రుల త్యాగాలను స్మరించుకునే పవిత్ర సందర్భం. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాలని’ సూచించారు.