News March 17, 2025
MBNR: ప్రేమ పెళ్లి.. నెలన్నరకే ఆత్మహత్య

జడ్చర్ల మండలంలో నవ వధువు ఆదివారం ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. స్థానికుల వివరాలు.. రాళ్లగడ్డతండాకు చెందిన పవన్కుమార్, ఖమ్మం జిల్లాకు చెందిన చర్చిత(23) ఖమ్మంలో చదువుతున్న సమయంలో ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి 45రోజుల క్రితం పెళ్లిచేసుకున్నారు. కారణం ఏంటో తెలియదు కాని పవన్ ఇంట్లో నుంచి బయటికెళ్లగానే చర్చిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
Similar News
News December 17, 2025
ఆదిలాబాద్: సమస్యలు సృష్టించే 756 మంది బైండోవర్

ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో గొడవలు సృష్టించే అవకాశం ఉన్న 756 మందిని బైండోవర్ చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 20 మంది వద్ద ఉన్న ఆయుధాలను కూడా సేఫ్ డిపాజిట్ చేయడం జరిగిందన్నారు. మూడు విడతల బందోబస్తులో ఫారెస్ట్, టీజీఎస్పీ, ఏసీటీపీసీ సిబ్బంది పాల్గొంటున్నారని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
News December 17, 2025
డిసెంబర్ 17: చరిత్రలో ఈరోజు

* 1903: రైట్ సోదరులు తయారు చేసిన విమానం మొదటిసారి ఎగిరింది
* 1914: క్రికెట్ లెజెండ్ సయ్యద్ ముస్తాక్ అలీ జననం
* 1959: నటి జయసుధ జననం
* 1959: ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య మరణం
* 1985: నటుడు అడివి శేష్ జననం
* 1996: సినీ నటి సూర్యకాంతం మరణం(ఫొటోలో)
News December 17, 2025
SRCL: లక్ష్మీనరసింహస్వామికి అగ్గిపెట్టెలో ఇమిడే చీర అందజేత

సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్ మరో అద్భుతం సృష్టించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేకించి అగ్గిపెట్టెలో ఇమిడే రెండు గ్రాముల బంగారు చీరను మంగళవారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవో వెంకటస్వామికి అందించారు. దీని పొడవు 5:30 మీటర్లు వెడల్పు 48 ఇంచులు దీనిని తయారు చేయుటకు వారం రోజుల వ్యవధి పట్టిందన్నారు. ఈ సందర్భంగా నల్ల విజయ్కు అర్చకులు ఆశీర్వచనం అందజేశారు.


