News March 2, 2025
MBNR: ఫోన్ ఇవ్వలేదని మహిళ హత్య

గత నెల 26న జరిగిన మహిళహత్య కేసును పోలీసులు ఛేదించారు. వారు తెలిపిన వివరాలిలా.. మునిరంగస్వామి జాతర సందర్భంగా గతనెల 19న కొత్తమొల్గరకి చెందిన రంగమ్మకు భూత్పూర్‌కి చెందిన రాజుతో పరిచయమైంది. ఈక్రమంలో రాజు తన ఫోన్‌ను ఆమెకు ఇచ్చాడు. తిరిగి ఆ ఫోన్‌ని అడగటంతో ఆమె నిరాకరించింది. ఈనెల 26న ఆలయం వద్ద రాజు ఆమె తలపై బండరాళ్లతో దాడి చేసి పారిపోయాడు. ఫోన్ ఆధారంగా అతడిని పట్టుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు.
Similar News
News November 20, 2025
HYD: మెట్రోలో వారి కోసం ప్రత్యేక స్కానింగ్

మెట్రోలో భద్రత మా ప్రాధాన్యం అని HYD మెట్రో తెలిపింది. ప్రతి స్టేషన్‌లో ఆధునిక సీసీటీవీ నిఘా, కఠిన భద్రతా తనిఖీలు అమలు చేస్తూ ప్రయాణికుల రక్షణను మరింత బలపరుస్తున్నట్లు తెలిపింది. ఫేస్‌మేకర్లు, గుండె రోగులు, గర్భిణీలకు పూర్తిగా సురక్షితమైన స్కానర్లు ఏర్పాటు చేయడం మెట్రో భద్రతా ప్రమాణాలకు నిదర్శనంగా పేర్కొంది.
News November 20, 2025
తిరుమల: వేగంగా ఫుడ్ ల్యాబ్ పనులు

భక్తులకు నాణ్యమైన ఆహారం అందించే దిశగా తిరుమలలో స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.19.84 కోట్లు విడుదల చేసింది. ల్యాబ్ యంత్రాలు ఇప్పటికే తిరుమలకు చేరుకున్నాయి. ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. డిసెంబర్ నెలలో ల్యాబ్ ప్రారంభించేలా పనులు చేస్తున్నారు.
News November 20, 2025
దేవ్‌జీ, రాజిరెడ్డి మా వద్ద లేరు.. HCకి తెలిపిన పోలీసులు

AP: టాప్ మావోలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డిని కోర్టులో హాజరుపర్చేలా ఆదేశించాలన్న పిటిషన్లపై పోలీసులు HCలో వివరణ ఇచ్చారు. వారిద్దరూ తమ వద్ద లేరన్నారు. దీంతో వారు పోలీసుల వద్ద ఉన్నారనేందుకు ఆధారాలు చూపాలని పిటిషనర్లను HC ఆదేశించింది. మావో కీలక నేతలు తమ అధీనంలో ఉన్నారన్న పోలీసుల ప్రెస్ స్టేట్‌మెంట్‌ను సమర్పిస్తామని పిటిషనర్లు చెప్పడంతో విచారణను HC రేపటికి వాయిదా వేసింది.


