News March 2, 2025
MBNR: ఫోన్ ఇవ్వలేదని మహిళ హత్య

గత నెల 26న జరిగిన మహిళహత్య కేసును పోలీసులు ఛేదించారు. వారు తెలిపిన వివరాలిలా.. మునిరంగస్వామి జాతర సందర్భంగా గతనెల 19న కొత్తమొల్గరకి చెందిన రంగమ్మకు భూత్పూర్కి చెందిన రాజుతో పరిచయమైంది. ఈక్రమంలో రాజు తన ఫోన్ను ఆమెకు ఇచ్చాడు. తిరిగి ఆ ఫోన్ని అడగటంతో ఆమె నిరాకరించింది. ఈనెల 26న ఆలయం వద్ద రాజు ఆమె తలపై బండరాళ్లతో దాడి చేసి పారిపోయాడు. ఫోన్ ఆధారంగా అతడిని పట్టుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు.
Similar News
News November 9, 2025
MBNR: తగ్గిన ఉష్ణోగ్రతలు.. పెరిగిన చలి

మహబూబ్నగర్ జిల్లాల్లో గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గడంతో.. చలి తీవ్రత పెరిగింది. దీంతో ఉదయం వేళ పొలాల వద్దకు వెళ్లే రైతులు, కంపెనీలో పనిచేసే కార్మికులు, పాఠశాల కళాశాలకు వెళ్లే విద్యార్థులు చలితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలానగర్, రాజాపూర్ గండేడ్ మండలాలలో 14.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మున్ముందు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు అన్నారు.
News November 9, 2025
జడ్చర్లలో నకిలీ రూ.500 నోట్ల కలకలం

నకిలీ రూ.500 నోట్లతో వస్తువులు కొనుగోలు చేయడానికి వచ్చిన ఓ వ్యక్తిని జడ్చర్ల మండల కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీలో దుకాణ యజమాని పట్టుకున్నాడు. శనివారం దుకాణానికి వచ్చిన ఆ వ్యక్తి ఇచ్చిన మూడు నకిలీ రూ.500 నోట్లను యజమాని గుర్తించి నిలదీశాడు. వెంటనే యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
News November 9, 2025
పల్నాడు యుద్ధం ఎక్కడ జరిగిందో తెలుసా..!

మినీ మహాభారతం, ఆంధ్ర కురుక్షేత్రంగా చరిత్రకెక్కించిన పల్నాడు యుద్ధం జరిగిన ప్రాంతం ఎక్కడో తెలుసా? పల్నాడు జిల్లా కారంపూడిలోని నాగులేరు వాగు ఒడ్డునే ఆ చారిత్రక ఘట్టం జరిగింది. యుద్ధంలో రక్తపుటేరులు ప్రవహించినట్లు చరిత్రకారులు చెబుతారు. వీరుల త్యాగాలను స్మరించుకుంటూ, అప్పటి ఆయుధాలను పూజిస్తూ ఇక్కడ వీరుల గుడిని నిర్మించారు. ప్రతి ఏటా ఇక్కడ ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం.


