News March 2, 2025
MBNR: ఫోన్ ఇవ్వలేదని మహిళ హత్య

గత నెల 26న జరిగిన మహిళహత్య కేసును పోలీసులు ఛేదించారు. వారు తెలిపిన వివరాలిలా.. మునిరంగస్వామి జాతర సందర్భంగా గతనెల 19న కొత్తమొల్గరకి చెందిన రంగమ్మకు భూత్పూర్‌కి చెందిన రాజుతో పరిచయమైంది. ఈక్రమంలో రాజు తన ఫోన్‌ను ఆమెకు ఇచ్చాడు. తిరిగి ఆ ఫోన్‌ని అడగటంతో ఆమె నిరాకరించింది. ఈనెల 26న ఆలయం వద్ద రాజు ఆమె తలపై బండరాళ్లతో దాడి చేసి పారిపోయాడు. ఫోన్ ఆధారంగా అతడిని పట్టుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు.
Similar News
News March 19, 2025
పెనుగంచిప్రోలు : జెయింట్ వీల్ ఊడి వ్యక్తి మృతి

పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఉత్సవాలలో జెయింట్ వీల్ ఊడిపడి ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు వత్సవాయి మండలం కొత్త వేమవరంకు చెందిన గింజుపల్లి సాయి మణికంఠగా గుర్తించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News March 19, 2025
ఆకివీడు: భార్య ఫ్రెండ్‌పై అత్యాచారయత్నం

ఆకివీడు మండలం చెరుకుమిల్లి శివారు ఉప్పరగూడెం గ్రామానికి చెందిన ద్రోణాద్రి నరసన్న అదే గ్రామానికి చెందిన మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. నరసన్న భార్య కువైట్ వెళ్లింది. తన భార్యతో ఫోన్లో మాట్లాడాలని స్నేహితురాలిని ఇంటికి పిలిచాడు. ఆమెపై అత్యాచారయత్నం చేయబోయాడు. మహిళ ఫిర్యాదుతో ఆకివీడు ఎస్ఐ హనుమంతు నాగరాజు కేసు నమోదు చేశారు.
News March 19, 2025
రాజమండ్రిలో సందడి చేసిన కోర్టు చిత్ర బృందం

రాజమండ్రిలోని స్వామిథియేటర్‌లో మంగళవారం ‘కోర్టు’ సినిమా యూనిట్ సందడి చేసింది. చిత్రంలో పులికొండ లాయర్ పాత్రపోషించిన ప్రియదర్శి, హీరో హర్షరోషన్, హీరోయిన్లు శ్రీదేవి,రిషిక, రైటర్ కమ్ డైరెక్టర్ రామ్ జగదీష్, మ్యూజిక్ డైరెక్టర్ తదితరులు పాల్గొని ప్రేక్షకులతో మాట్లాడారు. కోర్టు సినిమా అందర్ని గెలిపించిందన్నారు. మంచి చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ సినిమాను చూడాలన్నారు.