News August 7, 2024

MBNR: ఫ్యాన్సీ నంబర్‌కు రూ.5.75 లక్షలు

image

MBNR రవాణా శాఖ అధికారులు మంగళవారం టీజీ 06,6666 అనే ఫ్యాన్సీ నంబరుకు ఆన్‌లైన్ వేలం నిర్వహించగా.. 9 మంది వాహనదారులు ఒక్కొక్కరు రూ.30వేల చొప్పున చెల్లించారు. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగిన వేలంలో కె.బాలకృష్ణ అనే వ్యక్తి అత్యధికంగా రూ.5.45 లక్షలకు కోట్ చేయగా అధికారులు ఆయనకు ఆ నంబర్ కేటాయించారు.ఈ నంబరు వేలంతో రవాణా శాఖకు మొత్తం రూ.8.15 లక్షల ఆదాయం సమకూరింది.

Similar News

News September 14, 2024

NRPT: ఇక్కడ 48 ఏళ్లుగా ఆ ఊరిలో ఒకే దేవుడు..!

image

నారాయణపేట మండలం ఎక్లాస్ పూర్ గ్రామంలో 48ఏళ్లుగా ఒకే వినాయకుడిని ప్రతిష్ఠించి ఐకమత్యాన్ని చాటుకుంటున్నారు. సాధారణంగా గ్రామాల్లో, పట్టణాల్లో వాడవాడలా గణనాథుడిని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. అందుకు భిన్నంగా గ్రామంలో ఒకే గణనాథుడిని విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు. శుక్రవారం శ్రీగిరి పీఠం శివానంద స్వామి వినాయకుడిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఐకమత్యాన్ని కొనియాడారు.

News September 14, 2024

రేపు పాలమూరుకు సీఎం రేవంత్ రెడ్డి రాక

image

సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 15న చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్‌కు రానున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే G.మధుసూదన్ రెడ్డి తెలిపారు. MLA మధుసూదన్ రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి ఇటీవల మృతి చెందగా.. 15న నిర్వహించే దశ దిన కర్మకి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు హాజరుకానున్నారు. ఇప్పటికే ఎస్పీ జానకి సీఎం రాకతో ఏర్పాట్లపై సమీక్షించారు.

News September 14, 2024

ఓటరు జాబితా సవరణకు ఈనెల 21 వరకు అవకాశం: డిపిఓ

image

ఓటర్ జాబితాలో పేరు సవరణకు ఈనెల 21 వరకు అవకాశం కల్పించినట్లు వనపర్తి జిల్లా డిపిఓ సురేష్ కుమార్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నేపథ్యంలో ఆయన శుక్రవారం అమరచింత ఎంపీడీవో కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ప్రారంభించారు. ఈనెల 19 వరకు ఓటర్లు తమ పేర్లను సవరించుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈనెల 19న అఖిలపక్ష పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి 28న తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు.