News November 20, 2024

MBNR: బయోమెట్రిక్ హాజరు నమోదులో ఇబ్బందులు!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గత రెండు సంవత్సరాల నుంచి సిబ్బందికి బయోమెట్రిక్ విధానంలో హాజరు అమలు చేస్తున్నారు. కానీ కొన్ని కళాశాలల్లో బయోమెట్రిక్ పరికరాలు సరిగ్గా పనిచేయకపోవడంతో హాజరు నమోదు చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బయోమెట్రిక్ హాజరు నమోదు చేసేందుకు ఏర్పడుతున్న సాంకేతిక ఇబ్బందులను తొలగించాలని సిబ్బంది కోరుతున్నారు.

Similar News

News December 11, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు!!

image

✔కొనసాగుతున్న సీఎం కప్-2024 పోటీలు✔ఒలంపిక్ సంఘం అధ్యక్షుడిగా జితేందర్ రెడ్డి✔నీటిపారుదల సమీక్ష..పాల్గొన్న ఎమ్మెల్యేలు✔పెబ్బేరు:కారు బోల్తా.. ఇద్దరికి గాయాలు✔GDWL:TS- MESA జిల్లా సర్వసభ సమావేశం✔రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు రుణాలు:DGM✔బాలానగర్:రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి✔గ్రూప్-2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్లు✔మోహన్ బాబు SORRY చెప్పాలి:ప్రెస్ క్లబ్✔పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్

News December 11, 2024

మరికల్: అంగన్వాడీ కేంద్రాలపై సైబర్ కేటుగాళ్ల.. జాగ్రత్త

image

అంగన్వాడి కేంద్రాలపై సైబర్ నేరగాళ్లు కన్నేశారు. బుధవారం మరికల్, నారాయణపేటలో డబ్బులు కాజేశారు. అంగన్వాడీ టీచర్లతో ఫోన్లో మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు లబ్ధిదారులకు సరుకులు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని అడుగుతామని, మరికల్‌లో రూ.3వేలు, నారాయణపేటలో రూ.25వేలు దోచేశారని అంగన్వాడీ టీచర్లు పేర్కొన్నారు. లబ్ధిదారుల జాబితా సైబర్ నేలగాలకు చిక్కడంతో ఫోన్స్ వస్తున్నాయని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెప్పారు.

News December 11, 2024

తెలంగాణ ఒలంపిక్ సంఘం అధ్యక్షుడిగా జితేందర్ రెడ్డి ఎన్నిక

image

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన ఓట్ల లెక్కింపులో మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి 53 ఓట్ల మెజార్టీతో  రాష్ట్ర ఒలంపిక్ సంఘం అధ్యక్షుడిగా గెలుపొందారు. అనంతరం జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అవకాశం కల్పించిన ఓటర్ మహాశయులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తానని, రాష్ట్రం నలుమూలల క్రీడల పట్ల విద్యార్థులు, యువత ఆసక్తి పెంచుకునే విధంగా పనిచేస్తానని పేర్కొన్నారు.