News April 4, 2025

MBNR: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా మాజీ ఎమ్మెల్యే 

image

రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్ పర్సన్‌గా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ శాఖ కార్యాలయంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. చిన్నచింతకుంట మండలం పర్కాపూర్ గ్రామానికి చెందిన దివంగత మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి సతీమణి మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి ఉస్మానియాలో MA సోషియాలజీ పూర్తి చేశారు. 2009లో దేవరకద్ర ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Similar News

News November 25, 2025

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో ఉద్యోగాలు

image

ఇస్రో-<>విక్రమ్ <<>>సారాభాయ్ స్పేస్ సెంటర్ 5 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 7 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంబీబీఎస్, బీడీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 70ఏళ్లలోపు ఉండాలి. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. chsshelp@vssc.gov.in ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. వెబ్‌సైట్: www.vssc.gov.in

News November 25, 2025

మదనపల్లెలోకి పుంగనూరు.. తిరుపతిలోకి నగరి

image

చిత్తూరు జిల్లా స్వరూపం మరోసారి మారనుంది. పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలను కొత్తగా ఏర్పడబోయే మదనపల్లె జిల్లాలో చేరుస్తారు. నగరి డివిజన్ మొత్తాన్ని తిరుపతి జిల్లాలోకి మార్చనున్నారు. నగరి, నిండ్ర, విజయపురాన్ని తిరుపతిలో కలిపి.. పాలసముద్రాన్ని చిత్తూరు డివిజన్‌లోకి మారుస్తారని సమాచారం. వెదురుకుప్పం, కార్వేటినగరం మండలాలను తిరుపతిలో కలపాలనే ప్రజల డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోలేదు.

News November 25, 2025

కృష్ణా: నాడు నేడు పనులు పూర్తి చేస్తే బాగు.!

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో నాడు-నేడు పథకం కింద 80 నుంచి 90% వరకు పూర్తయిన పనులు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు లేక అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఎన్టీఆర్ జిల్లాలో 175, కృష్ణా జిల్లాలో 100 పైగా పాఠశాలల్లో అదనపు గదులు, మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. సుమారు 600 పైగా స్కూళ్లలో పెయింటింగ్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.