News February 1, 2025

MBNR: బి-ఫార్మసీ పరీక్షలు ప్రారంభం

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో బి-ఫార్మసీ సెమిస్టర్-3 పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీలో ఉన్న పరీక్ష కేంద్రాన్ని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ చెన్నప్ప, ఓఎస్డీ మధుసూదన్ రెడ్డితో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. బార్కోడ్స్‌పై వివరాలు సరిచూసుకోవాలని, పరీక్షల ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

Similar News

News January 5, 2026

భూములను సంరక్షించి వక్ఫ్ బోర్డుకు అప్పగించాలి: ఆదర్శ్

image

వనపర్తి జిల్లాలో గెజిట్ ప్రకారం ఆయా ప్రాంతాల్లో ఉన్న వక్ఫ్ భూములను ఆక్రమణలకు గురికాకుండా చర్యలు చేపడతామని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వక్ఫ్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఆయా ప్రాంతాల్లో 898.36 ఎకరాలు ఉన్న వక్ఫ్ భూములు అక్కడక్కడ ఆక్రమణలకు గురవుతున్నాయని, వాటిని సంరక్షించి వక్ఫ్ బోర్డుకు అప్పగించాల్సిందిగా కమిటీ సభ్యులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు.

News January 5, 2026

బంగ్లాదేశ్ ఎన్నికలపై భారత్ కలవరపాటు!

image

బంగ్లాదేశ్‌లో మార్చిలో జరిగే ఎన్నికలు భారత ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. ప్రస్తుతం బంగ్లాలో నెలకొన్న పరిస్థితులు, తాత్కాలిక ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి దీనికి కారణాలుగా ఉన్నాయి. నిషేధిత అవామీ లీగ్‌ను జాతీయ పార్టీ BNP, జమాత్‌తో పాటుగా ఎన్నికల పోటీకి అనుమతించాలనే భారత్ కోరుకుంటోంది. స్వేచ్ఛ లేకుండా ఎన్నికలు జరిగితే మైనారిటీలపై దాడులు మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్రం ఆందోళన చెందుతోంది.

News January 5, 2026

గ్రామాభివృద్ధికి కూటమి కృషి చేస్తుంది: జిల్లా గ్రంథాలయ ఛైర్మన్

image

గ్రామాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఉండి నియోజవర్గం జనసేన పార్టీ ఇన్‌ఛార్జి జుత్తుగ నాగరాజు అన్నారు. ఉండి మండలం మహాదేవపట్నంలో సీసీ రోడ్డుకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. గ్రామ సర్పంచ్ వనమా సుబ్బలక్ష్మి శ్రీనివాస్, జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు బద్రి, పాసర్ల శ్రీనివాస్, నాగేశ్వరావు, పండు, కూటమి నాయకులు ఉన్నారు.