News February 1, 2025
MBNR: బి-ఫార్మసీ పరీక్షలు ప్రారంభం

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో బి-ఫార్మసీ సెమిస్టర్-3 పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీలో ఉన్న పరీక్ష కేంద్రాన్ని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ చెన్నప్ప, ఓఎస్డీ మధుసూదన్ రెడ్డితో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. బార్కోడ్స్‌పై వివరాలు సరిచూసుకోవాలని, పరీక్షల ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
Similar News
News February 25, 2026
రాష్ట్ర సేపక్ తక్రా పోటీల్లో కామారెడ్డి జట్టుకు ద్వితీయ స్థానం

వనపర్తి జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సేపక్ తక్రా పోటీల్లో కామారెడ్డి జిల్లా జట్టు ప్రతిభ కనబరిచి సీఎం కప్ సెకండ్ ఎడిషన్‌లో ద్వితీయ స్థానంలో సాధించింది. ఈ విషయాన్ని జిల్లా క్రీడాధికారి రంగా వెంకటేశ్వర్ తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షుడు తుమ్మ రమేశ్, కార్యదర్శి కుమ్మరి నరేశ్, కోశాధికారి సతీశ్ జట్టు సభ్యులను అభినందించారు. క్రీడాకారుల కృషి, క్రమశిక్షణ ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందన్నారు.
News February 25, 2026
నెతన్యాహు ‘హెక్సాగన్’ ప్లాన్: భారత్ కీలకం!

మోదీ ఇజ్రాయెల్ పర్యటన వేళ నెతన్యాహు ‘హెక్సాగన్ ఆఫ్ అలయన్స్’ అనే కొత్త కూటమిని ప్రతిపాదించారు. తీవ్రవాద శక్తులను ఎదుర్కోవడమే లక్ష్యంగా భారత్, ఇజ్రాయెల్, గ్రీస్, సైప్రస్‌లతో ఈ కూటమి ఏర్పడనుంది. పాక్-సౌదీల నాటో తరహా ఒప్పందానికి పోటీగా ఇది రానుంది. భారత్‌ను ఈ వ్యూహాత్మక కూటమిలో కీలక భాగస్వామిగా నెతన్యాహు అభివర్ణించారు. నేడు, రేపు (Feb 25, 26) ఇజ్రాయెల్‌లో మోదీ పర్యటించనున్నారు.
News February 25, 2026
ఫిల్మ్‌నగర్: సినిమా అవకాశం పేరుతో అసభ్యంగా ప్రవర్తన

సినిమాల్లో అవకాశాలంటూ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఏపీకి చెందిన ఓ యువతి సినిమా అవకాశాల కోసం నగరానికి రాగా, స్నేహితురాలి ద్వారా జీఎం రవి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. లుక్ టెస్ట్, స్కిన్ టెస్ట్ పేరుతో కార్యాలయానికి పిలిపించి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


