News September 4, 2024
MBNR: బీఆర్ఎస్ నేతలకు సంపత్ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్

విపత్కర పరిస్థితుల్లో BRS నేతలు రాజకీయాలు చేయొద్దని AICC కార్యదర్శి సంపత్ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా 24 గంటలు తమ ప్రభుత్వం, కాంగ్రెస్ కార్యకర్తలు పని చేస్తున్నారు. BRS నేతలు KTR, హరీశ్ రావు ఇద్దరు రాజకీయ లబ్ధి కోసం విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారు. జనాలు తిరగబడి చెప్పుతో కొట్టే రోజులు వస్తాయని’ ఆయన హెచ్చరించారు.
Similar News
News October 27, 2025
MBNR: బీ.ఫార్మసీ స్పాట్ అడ్మిషన్లకు.. 92 దరఖాస్తులు

పాలమూరు విశ్వవిద్యాలయం బీ.ఫార్మసీ కోర్సులో మిగిలినటువంటి 11 సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించగా సోమవారం సాయంత్రం గడువు ముగిసే సమయానికి 92 దరఖాస్తులు వచ్చాయని రిజిస్ట్రార్ ఆచార్య పి.రమేష్ బాబు తెలిపారు. మంగళవారం వివిధ కేటగిరిల, మెరిట్ ప్రకారం అడ్మిషన్లను ప్రకటిస్తామని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. ఈ అడ్మిషన్ ప్రక్రియలో ప్రిన్సిపల్, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు.
News October 27, 2025
MBNR: కురుమూర్తి జాతర.. ప్రత్యేక బస్సులు

కురుమూర్తి జాతర సందర్భంగా మహబూబ్ నగర్ బస్ స్టేషన్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సుజాత Way2Newsతో తెలిపారు. నేటి నుంచి ఈనెల 30 వరకు కురుమూర్తి జాతర నేపథ్యంలో ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని, ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రయాణికులు, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.SHARE IT.
News October 26, 2025
MBNR: సాదాబైనామాల పరిష్కారానికి మోక్షం

సాదాబైనామాల దరఖాస్తుల పరిష్కారానికి మోక్షం కలగనుంది. జీఓ 112 అమలుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయడంతో క్రమబద్ధీకరణ ప్రక్రియను రెవెన్యూ అధికారులు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 2020లో ఆన్‌లైన్‌లో వచ్చిన 4,217, ఇటీవల రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన 3,456 దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించారు. దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.


