News September 27, 2024
MBNR: బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్.. బిడ్డాలెందరూ కోల్..!

తెలంగాణ ఆడబిడ్డలకు ఇష్టమైన పండుగ బొడ్డెమ్మ… బతుకమ్మ పండుగకు ముందు 9, 5,3 రోజులు ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈ పండుగను జరుపుకుంటారు. తెలంగాణ సంప్రదాయం పాటించే కన్నెపిల్లలు, బాలికలు మట్టితో చేసిన బొడ్డెమ్మలను పెట్టి, పూలతో అలంకరించి చుట్టూ తిరుగుతూ ‘బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్.. బిడ్డాలెందరూ కోల్’ అంటూ కోలాటం ఆడతారు. మరి మీ గ్రామంలో బొడ్డెమ్మ పండుగ చేస్తే Way2Newsకు ఫొటోలతో వార్త పంపండి.
Similar News
News December 23, 2025
పాలమూరు యూనివర్సిటీలో అథ్లెటిక్స్ సెలక్షన్స్

ఏఐయూ టోర్నమెంట్ల కోసం జిల్లాలోని పాలమూరు యూనివర్సిటీలో అథ్లెటిక్స్ (పురుషులు) సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. ఉపకులపతి ప్రొఫెసర్ జి.ఎన్.శ్రీనివాస్ క్రీడాకారులను అభినందించారు. ఎంపికైన వారు జనవరి 12-16 వరకు బెంగళూరులో జరిగే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొంటారు. ఈనెల 24న అథ్లెటిక్స్ ఉమెన్స్, 29న ఉమెన్స్ క్రికెట్ సెలక్షన్లు ఉంటాయని ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ వై.శ్రీనివాసులు తెలిపారు.
News December 22, 2025
పాలమూరు యూనివర్సిటీ.. రేపు ‘అథ్లెటిక్స్’ ఎంపికలు

పీయూ పురుషుల అథ్లెటిక్స్ ఎంపికలు ఈనెల 23న యూనివర్సిటీలోని సింథటిక్ మైదానంలో జరగనుంది. సౌత్ జోన్ ఆలిండియా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు PD డా.వై.శ్రీనివాసులు ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ముఖ్యఅతిథిగా VC ప్రొఫెసర్ జీఎన్.శ్రీనివాస్ హాజరుకానున్నారు. 17-25 ఏళ్ల లోపు వయసున్న క్రీడాకారులు అర్హులని, ఆసక్తి గల వారు బోనఫైడ్, టెన్త్ మెమో, ఎలిజిబిలిటీ ఫామ్లతో హాజరుకావాలని సూచించారు.
News December 22, 2025
MBNR: ప్రజావాణి..11 దరఖాస్తులు: ఎస్పీ

MBNR జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి బాధితులు తరలివచ్చారు. జిల్లా ఎస్పీ జానకి స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 11 దరఖాస్తులు అందగా, వాటిని ఎస్పీ శ్రద్ధగా పరిశీలించారు. సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, ఆయా కేసులపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలన్నారు.


