News March 23, 2025

MBNR: భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి

image

నూతనంగా నిర్మిస్తున్న భవనంపై నుంచ పడి వ్యక్తి మృతిచెందిన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. గాజులపేటకు చెందిన రమేశ్(42) పీయూ ఆవరణలో నిర్మిస్తున్న భవనంలో పనులు చేస్తుండగా జారి కిందపడ్డారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని జనరల్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం HYDకి తీసుకెళ్తుండగా.. మార్గమధ్యంలో చనిపోయారు. ఈ మేరకు కేసు నమోదైంది.

Similar News

News April 1, 2025

మహబూబ్‌నగర్: ఇటుక బట్టీలో ఛిద్రమవుతోన్న బాల్యం..!

image

మహబూబ్‌నగర్ రూరల్ మండల పరిధిలోని కోడూరు గ్రామం దగ్గర చిన్నారులు బాల కార్మికులుగా మారుతున్నారు. పలక, బలపం పట్టాల్సిన చేతులు యాజమాన్యాల కింద నలిగిపోతున్నాయి. ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న బిహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన చిన్నారులను బడిలో ప్రవేశం కల్పించకుండా బాల కార్మికుల చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారు. పోలీస్, రెవెన్యూ, విద్య,శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో సంరక్షించాలని స్థానికులు కోరారు. 

News April 1, 2025

MBNR: తప్పుడు కేసులకు భయపడొద్దు: మాజీ మంత్రి

image

తప్పుడు కేసులకు భయపడొద్దని, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాసానిపల్లికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నేత రవి నేరంలో ప్రమేయం లేకున్నా తప్పుడు కేసు నమోదు చేశారని ఆయన అన్నారు. జైలుకి వెళ్లి బెయిల్‌పై బయటికి వచ్చిన ఆయనను ఇంటికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు.

News March 31, 2025

మహబూబ్‌నగర్: రంజాన్ పండుగ భద్రతను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ

image

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ డి.జానకి ఈద్గాను సందర్శించారు. ఈ సందర్భంగా ఈద్గా వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి పోలీస్ సిబ్బందితో మాట్లాడారు. శాంతిభద్రతలు, ప్రజల సౌకర్యం, శాంతియుతం,ట్రాఫిక్ నిర్వహణ, ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని సీసీ కెమెరాల పర్యవేక్షణ, అత్యవసర సేవల ఏర్పాట్లు ఈద్గా, మసీదులు ప్రధాన కూడళ్ల వద్ద అదనపు బందోబస్తు అంశాలపై అధికారులతో సమీక్షించారు.

error: Content is protected !!