News May 4, 2024
MBNR: భానుడి భగభగలు.. వీటికి ఫుల్ డిమాండ్

భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. జిల్లాలో ప్రతీ 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదై పలు ప్రాంతాలు రెడ్జోన్ లోకి వెళ్లాయి. ఈ పరిస్థితుల్లో వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు రకరకాలుగా యత్నిస్తున్నారు. కొందరు కొబ్బరి బోండాలు, శీతల పానీయాలను తాగు తుండగా, ఎక్కువ మంది తాటి ముంజలను తినేందుకు ఇష్టపడుతున్నారు. వేసవిలోనే ప్రత్యేకంగా లభించే తాటి ముంజలకు జిల్లాలో డిమాండ్ విపరీతంగా పెరిగింది.
Similar News
News January 2, 2026
MBNR: ట్రాన్స్ జెండర్లకు గుడ్ న్యూస్.. అప్లై చేసుకోండి

మహబూబ్ నగర్ జిల్లాలోని ట్రాన్స్ జెండర్లకు 100% సబ్సిడితో ఆర్ధిక పునరావాస పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ అధికారిణి యస్.జరీనా బేగం తెలిపారు. అర్హులైన ముగ్గురు(3) ట్రాన్స్ జెండర్స్ కు ఒక్కొకరికి రూ.75వేల చొప్పున మొత్తం 1 యూనిట్కు రూ.75 వేలు 100% సబ్సిడీ మీద జిల్లాకు కేటాయించడం జరిగిందని, ఈనెల 9లోగా దరఖాస్తును కార్యాలయంలో సమర్పించారన్నారు.
News January 1, 2026
మహబూబ్ నగర్ జిల్లా.. నేటి ముఖ్యాంశాలు

@ జిల్లాలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
@ మిడ్జిల్ మండలం లింబ్యాతాండ గేటు వద్ద వ్యక్తి మృతి
@ దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి సమీక్ష
@ బాలానగర్ మండలం పెద్దరేవల్లిలో కారుతో ఢీకొట్టిన ఘటనలో ఒక వ్యక్తిపై కేసు నమోదు
@ జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత
News January 1, 2026
MBNR: ట్రాలీ బోల్తా.. 15 మేకలు మృతి

ఇల్లందు మండలం పోచారం తండా సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మేకలు మృతి చెందాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన సంచార జీవుల మేకల ట్రాలీ, గుండాల మండలం శెట్టిపల్లి నుండి మేత కోసం వెళ్తుండగా పోచారం గుట్ట వద్ద అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ట్రాలీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడగా, లోపల ఉన్న 15 మేకలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.


