News November 26, 2024

MBNR: భార్యను చంపి సెప్టిక్ ట్యాంకులో పడేశాడు!

image

మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం జరిగింది. స్థానికుల వివరాలు.. భూత్పూర్ మం. ఎల్కిచెర్లలో నారమ్మను భర్త వెంకటయ్య హతమార్చాడు. అనంతరం సెప్టిక్ ట్యాంక్‌‌లో పడేసి ఏమీ తెలియనట్లే ఉన్నాడు. ఈ నెల 17న నారమ్మ కనిపించడం లేదంటూ కుమారుడు భరత్‌‌తో నాటకమాడారు. దీంతో 21న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది.

Similar News

News December 11, 2024

మహబూబ్‌నగర్‌లో మృతదేహం కలకలం

image

గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన మహబూబ్‌నగర్‌లో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి మెయిన్ గేట్ పక్కన రూం సమీపంలో ఓ వ్యక్తి చనిపోయి రక్తపు మడుగులో ఉన్నాడు. మృతుడి వయసు 40-45 ఏళ్లు ఉంటుంది. అతడి రెండు చేతులు కొట్టేసి ఉన్నాయి. ఎవరైనా గుర్తిస్తే 8712659312, 8712659334 నంబర్లకు సమాచారం ఇవ్వాలని 2-టౌన్ ఎస్ఐ తెలిపారు. ఇది హత్యనా.. ప్రమాదమా తెలియాల్సి ఉంది.

News December 11, 2024

గద్వాల: ప్రేమ పెళ్లి.. అనుమానాస్పదంగా సూసైడ్

image

గద్వాల పట్టణంలోని భీమ్‌నగర్ కాలనీకి చెందిన <<14843542>>అనుమానాస్పదంగా <<>>పవిత్ర నిన్న మృతిచెందిన విషయం తెలిసిందే. బంధువుల, పోలీసుల వివరాల ప్రకారం.. మల్దకల్ మండలం మద్దెలబండకి చెందిన కుమ్మరి వినయ్- పవిత్ర రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వరకట్నం కోసం భర్త, కుటుంబ సభ్యుల వేధింపులతోనే తన కుమార్తె సూసైడ్ చేసుకున్నట్లు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీను తెలిపారు.

News December 11, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!

image

✔గద్వాల: యువతి అనుమానాస్పద మృతి
✔ఫీజు రియంబర్మెట్స్ విడుదల చేయాలి:BC సంఘం
✔MBNR: హౌస్ వైరింగ్..ఉచిత శిక్షణ,భోజనం
✔ఉమ్మడి జిల్లాలో తగ్గుతున్న అమ్మాయిల జననాలు
✔గండీడ్,గుండుమాల్ ప్రాంతంలో చిరుత సంచారం
✔15,16 తేదీల్లో గ్రూప్- 2 పరీక్షలు: కలెక్టర్లు
✔కాంగ్రెస్ ఏడాది పాలనలో అభివృద్ధి శూన్యం:BRS
✔సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
✔అంబులెన్స్ సేవలను ప్రారంభించిన మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి