News December 3, 2024

MBNR: భోజన నాణ్యతపై ఫోకస్ పెట్టండి: కలెక్టర్

image

భోజన నాణ్యతలో రాజీ పడకూడదని, ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. సోమవారం ప్రభుత్వ కళాశాల విద్యార్థుల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, అన్నింటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పలు సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గృహ సంక్షేమ అధికారి మాధవి, ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు.

Similar News

News November 30, 2025

ALERT: ప్రజావాణి రద్దు: కలెక్టర్

image

మహబూబ్ నగర్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి వినతులను స్వీకరించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమం రద్దయిన విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని సూచించారు.

News November 30, 2025

MBNR: నామినేషన్ కేంద్రాలను సందర్శించిన ఎస్పీ

image

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్ఠం చేసేందుకు భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ డి.జానకి కోయిలకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండో విడత నామినేషన్ కేంద్రాలైన కోయిలకొండ, సంగినోని పల్లి, ఎల్లారెడ్డిపల్లి, మోదీపూర్, శేరివెంకటపూర్, సూరారం, ఖాజీపూర్ గ్రామాలను వరుసగా సందర్శించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని ఆదేశించారు. ఎస్సై తిరుపాజి పాల్గొన్నారు.

News November 30, 2025

ఉమ్మడి MBNR జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గత ఐదు రోజులుగా చలి తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో గండీడ్ మండలం సల్కర్‌పేటలో 15.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్‌లో 15.9 డిగ్రీలు, బాలానగర్‌లో 16.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చలి కారణంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడ్డారు.