News June 20, 2024
MBNR: మంజూరైనా నిర్మాణం కాని మామిడి క్లస్టర్
ఉమ్మడి జిల్లాకు 2021లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన మామిడి క్లస్టర్ మూడేళ్లుగా నిర్మాణానికి నోచుకోవడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17,284 మంది మామిడి రైతులు 57,344 ఎకరాల్లో మామిడి తోటలు సాగు చేస్తున్నారు. అయితే స్థానికంగా మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చినందున క్లస్టర్ నిర్మాణాన్ని చేపడతారని రైతులు ఆశిస్తున్నారు.
Similar News
News September 18, 2024
శ్రీశైలంలో నీటిమట్టం 881.7 అడుగులు
ఎగువ ఉన్న జూరాల, సుంకేసుల నుంచి మొత్తం 40,949 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో శ్రీశైలం జలాశయానికి చేరుతుంది. ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 37,116 క్యూసెక్కులు, ఏపీ జెన్‌కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 30,755 మొత్తం 67,871 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. జలాశయంలో మంగళవారం నీటిమట్టం 881.7 అడుగుల వద్ద 197.4616 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
News September 18, 2024
గద్వాల: అమ్మమ్మ మరణంతో అనాథలైన చిన్నారులు
అమ్మమ్మ మరణంతో చిన్నారులు అనాథలయ్యారు. వడ్డేపల్లి శాంతినగర్ చెందిన కృష్ణవేణికి ఉదయ్ కౌసిక్(11), భానుప్రకాష్(10) ఇద్దరు పిల్లలు. పిల్లల చిన్నతనంలోనే భర్త ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బంది పడ్డ కృష్ణవేణి అనారోగ్యంతో చనిపోగా తాజాగా.. ఆమె తల్లి జయమ్మ మృతితో పిల్లలు అనాథలయ్యారు. కాగా వారిని ఆస్తిని కాపాడి చిన్నారులను ఆదుకోవాలని అధికారులను స్థానికులు కోరారు.
News September 18, 2024
ఉమ్మడి జిల్లాలో వేరుశనగ సాగుకు రైతులు సన్నద్ధం !
ఉమ్మడి పాలమూరు జిల్లాలో వేరుశనగను సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వర్షాలు పుష్కలంగా కురవడంతో ఈ ఏడాది 2.60 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అత్యధికంగా NGKL జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో ఆ తరువాత వనపర్తి జిల్లాలో 40 వేల ఎకరాల్లో వేరుశనగ సాగు చేయనున్నారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.