News April 14, 2025
MBNR: మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న మహమ్మదాబాద్ మండలంలో జరిగింది. పోలీసుల వివరాలు.. జంగంరెడ్డిపల్లికి చెందిన ఆనంద్(24) HYDలో కూలీ పనిచేసుకుని జీవిస్తున్నాడు. శనివారం సొంతూరుకు వచ్చాడు. మద్యానికి బానిసైన ఆనంద్.. తనకంటూ ఎవరూ లేరని తనలో తాను కుమిలిపోవటం చేస్తుండేవాడు. ఈ క్రమంలో పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకుని మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News April 16, 2025
మహబూబ్ నగర్ జిల్లాలో.. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

మహబూబ్ నగర్ జిల్లాలో వేసవి తీవ్రత రోజుకు పెరుగుతుంది. గత 24 గంటల్లో కౌకుంట్ల 40.6 డిగ్రీలు, దేవరకద్ర 40.5 డిగ్రీలు, అడ్డాకుల, మిడ్జిల్ మండలం కొత్తపల్లి 40.1 డిగ్రీలు, కోయిలకొండ మండలం పారుపల్లిలో 40.0 డిగ్రీలు, చిన్నచింతకుంట మండలం వడ్డేమాన్ 39.8 డిగ్రీలు, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 39.4 డిగ్రీలు, మూసాపేట మండలం జానంపేట 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
News April 16, 2025
MBNR: డబ్బా మీద పడి మహిళ మృతి

మూసాపేట మండలంలో ఓ చిరువ్యాపారి నిర్వహిస్తున్న డబ్బా మీద పడి మహిళ మృతి చెందారు. స్థానికుల వివరాలు.. వేముల గ్రామ శివారులోని ఓ కంపెనీ దగ్గర ఓ వ్యాపారి కిరాణా డబ్బాను నిర్వహిస్తున్నారు. రెండు రోజులుగా ఆ కంపెనీ దగ్గర అయ్యమ్మ(75) వరి ధాన్యాన్ని అరబెట్టుకుంటూ ఉండేది. నిన్న సాయంత్రం కురిసిన గాలివానకు ఆమె ఆ డబ్బా దగ్గర తలదాచుకుంది. ప్రమాదవశాత్తు ఆ డబ్బా ఆమె మీద పడటంతో అయ్యమ్మ అక్కడికక్కడే మృతిచెందింది.
News April 16, 2025
మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ WARNING

రైతులు పండించిన ధాన్యాన్ని రోడ్లపై ఆరబోసి ప్రమాదాలకు కారణం కావద్దని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ జానకి ధరావత్ హెచ్చరించారు. అతి వేగంగా రోడ్లపై ప్రయాణించే వాహనదారులు రోడ్లపై కుప్పలుగా ఉన్న ధాన్యాన్ని గమనించకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. రోడ్లపై ధాన్యం కుప్పలు పోసి వాటిపై నల్ల కవర్లు కప్పడంతో రాత్రి సమయంలో అవి కనిపించడం లేదని, ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందన్నారు.