News February 8, 2025

MBNR: మన్యంకొండ గుట్టపైకి ఉత్సాహమూర్తి పల్లకి సేవ.!

image

శ్రీమన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి కోట కదిర గ్రామంలోని అళహరి వంశీయుల ఇంటి నుంచి స్వామివారి ఉత్సవ మూర్తి ఊరేగింపు వైభవంగా ప్రారంభమైంది. మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారిని కోటకదిర గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పల్లకి సేవలో పాల్గొన్నారు. రాత్రి స్వామివారి తిరుచ్చి సేవా నిర్వహిస్తారు. ఆలయ ఛైర్మన్ అళహరి మధుసూదన్ కుమార్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Similar News

News February 8, 2025

NGKL: యువకుడి ఆత్మహత్య

image

తాను ప్రేమించిన యువతి ఇంట్లో తమ పెళ్లికి ఒప్పుకోలేదని ఓ యువకుడు ఆత్మహత్యకి పాల్పడిన ఘటన శుక్రవారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. NGKL మండలం పెద్దాపూర్‌కి చెందిన యాదగిరి (23) ఓ యువతిని ప్రేమించాడు. వీరి ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవటంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి అన్న సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

News February 7, 2025

నేటి నుంచి మన్యంకొండ బ్రహ్మోత్సవాలు 

image

మన్యంకొండ శ్రీ వెంకటేశ్వరా స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొండపై వెలసిన స్వామివారికి నేడు మొదటి రోజు అమ్మవార్ల ఊరేగింపు సేవ, 8న హంస వాహన సేవ, 9న ధ్వజ వాహన సేవ, 10న సూర్యప్రభ వాహన సేవ, 11న హనుమ వాహన సేవ,12న గరుడ వాహన సేవ,13న అశ్వవాహన సేవ,14న దర్బార్ సేవ,15న శేష వాహన సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

News February 7, 2025

గద్వాల: ట్రాన్స్ జెండర్‌‌తో ప్రేమ.. యువకుడి సూసైడ్..?

image

పురుగు మందు తాగి ఓ యువకుడు మృతి చెందిన ఘటన గద్వాల పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. చింతలపేటకు చెందిన నవీన్ అదే కాలనీకి చెందిన ట్రాన్స్ జెండర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఈక్రమంలో రెండు రోజుల క్రితం తన తండ్రి సమాధి వద్ద పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి ప్రైవేట్ పార్ట్స్ వద్ద గాయాలు ఉండటంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

error: Content is protected !!