News February 4, 2025

MBNR: మరో రెండు రోజులే మిగిలింది..!

image

తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఫిబ్రవరి 1న చివరి తేది ఉండగా.. ప్రభుత్వం దరఖాస్తు చివరి తేదీని ఫిబ్రవరి 6 వరకు పొడిగించింది. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేయనట్లయితే చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత శాఖ నాగర్‌కర్నూల్ జిల్లా అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News February 4, 2025

BREAKING: నాగర్‌కర్నూల్‌లో దారుణం.. తల్లిని చంపేశాడు!

image

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మహాదేవునిపేటలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన యాదమ్మ కుమారుడు కరుణాకర్ మద్యంతో పాటు డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కోపంతో కన్నతల్లిని గోడకేసి కొట్టి అతి కిరాతకంగా హత్య చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 4, 2025

గుండుమాల్‌: చిరుత పులి దాడిలో లేగ దూడ మృతి

image

గుండుమాల్ మండల పరిధిలో సోమవారం రాత్రి గుండుమాల్ గ్రామానికి చెందిన గుడిసె కుర్మయ్య పొలం దగ్గర చిరుత పులి దాడి చేయడంతో లేగ దూడ మృతి చెందింది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో చిరుత సంచారిస్తున్నట్లు రైతులు తెలిపారు. అటవీశాఖ అధికారులు స్పందించి రైతు కుర్మయ్యకు న్యాయం చేయడంతో పాటు చిరుత జాడను కనుక్కోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. కొత్తపల్లి మండలంలో మరో చిరుతను అటవీశాఖ అధికారులు గుర్తించారు.

News February 4, 2025

MBNR: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

image

పెళ్లి కావట్లేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలోని వేపూరిగేరికి చెందిన శ్రీనివాసులు(39) తండ్రి చిన్నతనంలోనే చనిపోగా, తల్లి అనారోగ్యంతో ఇంట్లో ఉంది. దీంతో ఒంటిరిగా జీవిస్తున్నట్లు భావించాడు. దీనికి తోడు పెళ్లికాకపోతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురై టీడీగుట్ట రైల్వేగేట్ దగ్గర రైలు కిందపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదైంది.

error: Content is protected !!