News April 12, 2024

MBNR: మరో 4 రోజులే త్వరపడండి..!

image

మహబూబ్ నగర్: ఓటు నమోదు, మార్పులు చేర్పులకు ఈనెల 15వ తేదీ వరకు సమయం ఉందని ఉమ్మడి జిల్లా ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు ఓటు హక్కు నమోదు చేసుకున్న వారికి త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంటుందని వారు పేర్కొంటున్నారు. 2006 మార్చి 31లోపు జన్మించిన వారంతా ఓటు హక్కు పొందేందుకు అర్హులని తెలిపారు. దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

Similar News

News March 27, 2025

మహబూబ్‌నగర్‌లో ముమ్మరంగా రంజాన్ ఏర్పాట్లు

image

రంజాన్ పండుగను పురస్కరించుకుని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వాగు గుట్ట వద్ద మైనార్టీ సోదరులు ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా నిర్వహిస్తున్న ఏర్పాట్లను మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, ముడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లైట్లు, కూలర్ల ఏర్పాటు విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అన్నారు. కార్యక్రమంలో నాయకుడు సిరాజ్ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.

News March 27, 2025

పాలమూరు: దంపతులు మృతి.. ఆ ఊరిలో విషాదం

image

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిచెందడంతో నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన సక్కుబాయి(40), పాండు(45) రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధి కొత్తూరు మండలంలోని తిమ్మాపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయి ఆ నలుగురు అనాథలుగా మారారు.

News March 27, 2025

MBNR: రైతన్నకు మంచినీటి కష్టాలు

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జాతీయ వ్యవసాయ మార్కెట్‌లో రైతన్నలు, వ్యవసాయ కూలీలకు నీళ్లు లేక వేసవి కాలంలో అలుమటిస్తున్నారు. మార్కెట్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా, నీటి మూటలుగానే మిగులుతున్నాయని వారు చెబుతున్నారు. వాటికి మరమ్మతులు చేసి వేసవిలో రైతులకు దప్పిక తీర్చాలని కూలీలు కోరుతున్నారు.

error: Content is protected !!