News March 28, 2024

MBNR: మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు వేళాయె!

image

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడు జరగనుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలను పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో సెక్టార్, రూట్ అధికారులు, పీవో, ఏపీవోలు కలిపి మొత్తం 450 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఉప ఎన్నికకు ఎన్నికల పరిశీలకురాలిగా రాష్ట్ర అటవీ, పర్యావరణ శాస్త్ర, సాంకేతికశాఖ ముఖ్యకార్యదర్శి వాణి ప్రసాద్ వ్యవహరిస్తున్నారు.

Similar News

News September 30, 2024

MBNR: కాసేపట్లో DSC రిజల్ట్స్.. అభ్యర్థులు వీరే!

image

DSC ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎస్జీటీ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా అభ్యర్థులు పోస్టులు పోటీ
MBNR: 3239 121 1:27
NGKL: 3625 125 1:29
NRPT: 2683 137 1:19
WNP: 2137 53 1:40
GDWL: 2893 72 1:40

News September 30, 2024

ఇంటర్ ప్రవేశాల గడువు అక్టోబర్ 15 వరకు పొడిగింపు

image

2024-25 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలో ప్రవేశాల గడువును అక్టోబర్ 15 వరకు పొడిగించినట్లు వనపర్తి డిఐఈఓ అంజయ్య ఆదివారం తెలిపారు. ప్రైవేటు జూనియర్ కళాశాలలో రూ.500 జరిమానాతో, ప్రభుత్వ కళాశాలలో ఫైన్ లేకుండా అక్టోబర్ 15 వరకు ఇంటర్ లోప్రవేశం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించిందని అన్నారు.

News September 30, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!!

image

❤U-19 టోర్నీ.. నల్గొండ పై పాలమూరు ఘనవిజయం
❤ధన్వాడ: 3 నుంచి రెజ్లింగ్ పోటీలు
❤3 నుంచి ఓపెన్ SSC,INTER సప్లిమెంటరీ పరీక్షలు
❤బిజినపల్లి:లంచం తీసుకున్న కానిస్టేబుల్ సస్పెండ్
❤కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల జులై వేతనాలు విడుదల
❤నవోదయ దరఖాస్తు గడువు పొడిగింపు
❤మద్యం సేవించి వాహనాలు నడపరాదు:SIలు
❤ప్రధాని మోదీ పేదల వ్యతిరేకి:CPM
❤వ్యవసాయ కార్మికులకు రూ.12 వేలు వెంటనే ఇవ్వాలి:BKMS