News February 27, 2025

MBNR: మహిళపై దాడి.. చికిత్స పొందుతూ మృతి

image

ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన భూత్పూర్ మండలంలో జరిగింది. పోలీసుల వివరాలు.. మండలంలోని కొత్త మోల్గర గ్రామానికి చెందిన రంగమ్మ (50) మంగళవారం ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ముని రంగస్వామి దేవాలయ వద్ద ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయగా రక్తపుమడుగులో కొట్టుమిట్టాడింది. గమనించిన స్థానికులు పోలీసులకు తెలపగా MBNR ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందిందని పోలీసులు తెలిపారు.

Similar News

News November 10, 2025

జూబ్లీహిల్స్ బై పోల్: డెమో తర్వాత అసలు ఓటింగ్!

image

రేపు సూర్యుడు ఉదయించే లోపే(5AM) జూబ్లీహిల్స్ బై పోల్‌లో పోటీలో ఉన్న క్యాండిడేట్లందరూ (58 మంది) ఓటేస్తారు. అది తాము వేసిన గుర్తుకే పడిందా? లేదా? అనేది నిర్ధారించుకుంటారు. డెమో ఓకే అయితేనే సంతృప్తి వ్యక్తం చేస్తారు. లేకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతారు. ఈ తతంగం పూర్తయిన తరువాత మోడల్ బ్యాలెట్ జరిగినట్లు PO అధికారికంగా ధ్రువీకరిస్తారు. ఆ తరువాత ఉదయం 7 గంటలకు అసలు ఎన్నిక మొదలవుతుంది.

News November 10, 2025

దళిత ఉద్యమ కెరటం డాక్టర్ కత్తి పద్మారావు

image

సాహిత్యం, దళిత ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి కత్తి పద్మారావు అని BR అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి ఘంటా చక్రపాణి, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చంద్రశేఖరరెడ్డి అన్నారు. విమలా స్మారక సాహిత్య జీవిత సాఫల్య పురస్కారం-2025 పద్మారావుకు ప్రకటించారు. నిన్న అనంతపురంలో జరిగిన సభకు అనివార్య కారణాల వల్ల పద్మారావు హాజరుకాలేదు. పురస్కారాన్ని ఆయన కుమారుడు చేతన్ అందుకున్నారు.

News November 10, 2025

JGTL: జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత

image

జగిత్యాల జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. మల్లాపూర్, మేడిపల్లి, సిరికొండ, పొలాస, రాయికల్, మన్నెగూడెంలో 14.7℃, సారంగాపూర్, నేరెల్ల, గోవిందారం, కొల్వాయి 14.8, గోదూరు, కోరుట్ల, కథలాపూర్, జగ్గసాగర్, వెల్గటూర్, ఐలాపూర్ 14.9, గుల్లకోట, పెగడపల్లె, మారేడుపల్లి, గొల్లపల్లె, అల్లీపూర్ 15, జైన, మల్లియాల్, తిరమలాపూర్, బుద్దేష్‌పల్లి, రాఘవపేట 15.1, మెట్పల్లి, జగిత్యాలలో 15.2℃ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.