News March 11, 2025
MBNR: మహిళలకు ఉచిత శిక్షణ.. APPLY చేసుకోండి..!

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మహిళలకు “SBI, SBRSETI” ఆధ్వర్యంలో ఉపాధి రంగాల్లో నెల రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ జీ.శ్రీనివాస్ తెలిపారు. Way2Newsతో ఆయన మాట్లాడుతూ.. బ్యూటీపార్లర్ కోర్సులో ఈనెల 13లోగా SSC MEMO, ఆధార్, రేషన్ కార్డులతో దరఖాస్తులు చేసుకోవాలని, ఉచిత శిక్షణ, భోజనం, వసతి ఉంటుందన్నారు. వయస్సు 19-45 ఏళ్లలోపు ఉండాలన్నారు.
Similar News
News November 28, 2025
శంషాబాద్: సమతా స్ఫూర్తి కేంద్రంలో 30న ఈక్వాలిటీ రన్

శంషాబాద్ మండలం ముచ్చింతల్ శివారులోని సమతా స్ఫూర్తి కేంద్రం వద్ద ఈనెల 30న ఈక్వాలిటీ రన్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి పర్యవేక్షణలో రన్ ఫర్ ఈక్వాలిటీ, ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్ అనే నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.హాఫ్ మారథాన్, 10కే, 5కే, 3కే విభాగాల్లో పరుగు ప్రారంభం అవుతుందన్నారు.
News November 28, 2025
4 వారాలుగా అనుమతించట్లేదు: ఇమ్రాన్ ఖాన్ సోదరి

జైలులో ఉన్న తన సోదరుడు ఇమ్రాన్ ఖాన్ను 4 వారాలుగా కలవనివ్వట్లేదని సోదరి నొరీన్ నియాజీ తెలిపారు. ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన నెలకొందన్నారు. ‘ఇమ్రాన్ ఖాన్ విషయంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు. జైలు అధికారులు ఏం చెప్పట్లేదు. మా సోదరుడిని చంపేసినట్లు వార్తలొస్తున్నాయి’ అని వాపోయారు. అంతకుముందు ఖైబర్ పఖ్తుంఖ్వా CM సోహైల్ రావల్పిండిలోని జైలు ముందు బైఠాయించి ఇమ్రాన్ ఖాన్కు మద్దతుగా నిరసన తెలిపారు.
News November 28, 2025
వేములవాడ పోలీసుల అదుపులో నిందితుడు సంతోశ్..!

మాజీ నక్సలైట్ బల్లెపు నర్సయ్య అలియాస్ సిద్ధయ్య హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న జక్కుల సంతోశ్ వేములవాడ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. తాను అజ్ఞాతంలో ఉండగా ఎందరినో చంపినట్లుగా నర్సయ్య ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పేర్లతో సహా చెప్పడంతో తన తండ్రిని నర్సయ్య చంపినట్లుగా నిర్ధారణకు వచ్చిన సంతోశ్ యూట్యూబ్ ఛానల్ కోసం ఇంటర్వ్యూ కావాలంటూ నర్సయ్యను పిలిపించి హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.


