News February 19, 2025
MBNR: మహిళలకు గుడ్ న్యూస్.. ఉచిత శిక్షణ

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహిళలకు “SBI, SBRSETI” ఆధ్వర్యంలో ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ G.శ్రీనివాస్ తెలిపారు. Way2Newsతో ఆయన మాట్లాడుతూ.. ఎంబ్రాయిడరీ డిజైన్ లలో ఈనెల 24 నుంచి 30 రోజుల పాటు ఉచిత శిక్షణ, భోజనం, వసతి ఉంటుందన్నారు. SSC MEMO, ఆధార్, రేషన్ కార్డులతో దరఖాస్తులు చేసుకోవాలని, 19-45 సం.లలోపు ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు 95424 30607కు సంప్రదించాలన్నారు.
Similar News
News October 20, 2025
ఖమ్మం: విద్యార్థి మృతి.. ఆర్ఎంపీ ఇంటి ముందు ఆందోళన

చింతకాని మండలం వందనం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి జస్వంత్ ఆర్ఎంపీ వైద్యం వికటించి మృతి చెందాడని అతని కుటుంబసభ్యులు ఆరోపించారు. కొదుమూరులోని ఆర్ఎంపీ వద్ద చికిత్స తీసుకున్న కొద్దిసేపటికే తమ బిడ్డ మృతి చెందాడన్నారు. ఆర్ఎంపీ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ అతని ఇంటి ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
News October 20, 2025
మీ చిన్ననాటి దీపావళి గుర్తుందా?

దీపావళి అనుభూతుల పండుగ. ఉదయం తొందరగా లేచి కొత్త బట్టలు, తీపి వాసనలతో నిండిన ఇంటి వాతావరణం, స్నేహితులతో టపాకులు పేలుస్తూ సందడి. అయితే ఇప్పుడు ఫోన్లు, షార్ట్ వీడియోలు దీపావళిని ఆక్రమించాయి. టెక్నాలజీ యుగంలో బాణాసంచాల కన్నా బిజీ లైఫ్, సెల్ఫీ ఫిల్టర్లే ఎక్కువ. మరి మీ నాటి దీపావళి జ్ఞాపకాలు గుర్తున్నాయా? టపాకాయాల కోసం ఇంట్లో మారాం చేశారా? కామెంట్ చేయండి..
News October 20, 2025
తప్పు చేస్తే కొడుకైనా శిక్ష తప్పదు..

చెడుపై మంచి గెలిచినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ దీపావళి పండుగను జరుపుకుంటాం. అయితే దీని వెనక మరోకోణం కూడా ఉంది. వరాహస్వామి అంశతో భూదేవి నరకుడికి జన్మనిస్తుంది. నరకుడు బాణాసురిడి స్నేహంతో రాక్షస లక్షణాలను పొంది ప్రజలను, మునులను బాధించడం మొదలుపెట్టాడు. ద్వాపరయుగంలో సత్యభామగా జన్మించిన భూదేవి విల్లంబులు చేతబట్టి నరకాసురుడిని వధిస్తుంది. తప్పు చేస్తే కొడుకైనా శిక్ష తప్పదని పురాణాలు చెబుతున్నాయి.