News March 22, 2025
MBNR: మార్చి 24 నుంచి ప్రయోగ తరగతులు ప్రారంభం

పాలమూరు జిల్లా MVS కళాశాలలోని డా.బీ.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ ఫస్ట్, సెకండ్ ఇయర్ సైన్స్, కంప్యూటర్ చదువుతున్న విద్యార్థులకు సెమిస్టర్ 1, 3 ప్రయోగ తరగతులు మార్చి 24న సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయని కళాశాల ప్రిన్సిపల్ డా.Dk.పద్మావతి, రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ జి.సత్యనారాయణ గౌడ్ తెలిపారు. విద్యార్థులు ఈ విషయం గమనించాలని సూచించారు.
Similar News
News October 15, 2025
సిరి సంపదలకు పునాది ‘వాస్తు’

వాస్తు బాగున్న ఇంట్లో నివసిస్తే వారికి సిరిసంపదలకు లోటుండదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘మంచి వాస్తు వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రభావవంతమైన ఆలోచనలు వస్తాయి. అవి అవకాశాలను సృష్టిస్తాయి. తద్వారా ఆదాయం పెరుగుతుంది. దీంతో మన జీవితంలో సౌకర్యాలు, సదుపాయాలు ఏర్పడతాయి. ఇవే అంతిమంగా మనకు ఆనందాన్ని, సంతృప్తిని అందిస్తాయి. వాస్తే మన సౌభాగ్యానికి తొలి మెట్టు’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News October 15, 2025
నల్లమలలో ఆయుర్వేదిక్ కళాశాల ఏర్పాటు

నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని హాజీపూర్ గ్రామ శివారులో ఆయుర్వేదిక్ కళాశాల ఏర్పాటు చేస్తామని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ఈ రోజు అధికారులతో కలిసి కళాశాల ఏర్పాటు ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. నల్లమల వాసుల చిరకాల స్వప్నం నెరవేరుతుందన్నారు. కళాశాల ఏర్పాటుకు సహకారం అందించిన సీఎం, వైద్య మంత్రి, పర్యాటక మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
News October 15, 2025
MBNR: యూనివర్సిటీని పరిశీలించిన ఎస్పీ

పాలమూరు యూనివర్సిటీలో లైబ్రరీ ఆడిటోరియంలో రేపు 4వ స్నాతకోత్సవానికి గవర్నర్ విష్ణుదేవ్ వర్మ హాజరు అవుతున్నందున జిల్లా ఎస్పీ డి.జానకి యూనివర్సిటీని ఈరోజు సందర్శించి సమావేశమయ్యే భవనాన్ని పరిశీలించారు. అనంతరం యూనివర్సిటీ అధికారులతో క్యాంపస్ అంతర్గత రోడ్డు మార్గం, వెహికల్ పార్కింగ్ మొదలైన విషయాల గురించి తెలుసుకున్నారు. రిజిస్ట్రార్ ప్రొ.పి.రమేశ్ బాబు, కంట్రోలర్ డా.కె.ప్రవీణ, డా.కుమారస్వామి ఉన్నారు.