News March 23, 2025

MBNR: మార్చి 31తో ముగియనున్న ఎస్సీ ఉపకార వేతనాల గడువు

image

ఎస్సీ ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకునే గడవు మార్చి 31తో ముగియనుందని షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు సుదర్శన్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఇప్పటివరకు కేవలం 70% మాత్రమే దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తు చేసుకొని వారు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత కళాశాలల ప్రిన్సిపల్‌లను కోరారు. విద్యార్థులు బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ సీడింగ్ చేయించుకోవాలన్నారు.

Similar News

News December 8, 2025

NSU లైంగిక వేధింపుల ఘటన.. ఒడిశా వెళ్లిన CI

image

తిరుపతి NSUలో లైంగిక వేధింపుల కేసులో విచారణ నిమిత్తం వెస్ట్ పోలీస్ స్టేషన్ సీఐ మురళీ మోహన్ తన బృందంతో ఒడిశాకు వెళ్లారు. యువతి కుటుంబ సభ్యులు ఫోన్‌లో అందుబాటులో లేకపోవడంతో యూనివర్సిటీ అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. కాగా యువతిని ఇప్పటికే బంధువుల ఇంట్లో ఉంచారని.. కేసు తమకు అవసరం లేదని వర్సిటీ అధికారులకు తల్లిదండ్రులు చెప్పినట్లు సమాచారం.

News December 8, 2025

చిత్తూరు జిల్లాలో కొత్త మోసం.. జాగ్రత్త.!

image

చిత్తూరులో కూరగాయలు అమ్మే ఓ వ్యక్తి తన బ్యాంక్ అకౌంట్‌ను రూ.10వేలకు వేరే వాళ్లకు విక్రయించాడు. వాళ్లు అతని పేరుతో ఫేక్ కంపెనీ సృష్టించి ట్యాక్స్‌లు ఎగ్గొట్టారు. GST అధికారులు రూ.12కోట్ల ట్యాక్స్ కట్టాలని నోటీసు ఇవ్వడంతో అసలు విషయం వెలుగు చూసింది. సైబర్ నేరగాళ్లు సైతం ఇలా పేదల అకౌంట్లు తీసుకుని మోసాలు చేస్తున్నారు. అకౌంట్‌ పేరు ఉన్నవాళ్లే కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ వివరాలు ఎవరికీ ఇవ్వకండి.

News December 8, 2025

అన్నమయ్య: పదో తరగతి విద్యార్థులకు గమనిక

image

మార్చిలో జరగనున్న పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు గడువును విద్యాశాఖ మరోసారి పొడిగించింది. అన్నమయ్య జిల్లా DEO సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. రూ.50 అపరాధ రుసుంతో ఈనెల 12 వరకు, రూ.200 అపరాధ రుసుంతో ఈనెల 15 వరకు, రూ.500 అపరాధ రుసుంతో ఈనెల 18 వరకు విద్యార్థులు ఫీజులు చెల్లించుకోవాలని సూచించారు.