News May 3, 2024
MBNR: మీ అభ్యర్థి వివరాలు తెలుసుకోండి ఇలా!
లోక్ సభ నియోజకవర్గంలో ఎంత మంది అభ్యర్థులు బరిలో నిలిచారన్నది చాలామందికి తెలియదు. ఎవరెవరు పోటీ చేస్తున్నారో కేవైసీ(నో యువర్ క్యాండిడేట్) యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. దీని ద్వారా పోటీ చేసే అభ్యర్థి విద్యార్హతలు, వారికి నేర చరిత్ర ఉందా, ఎక్కడెక్కడ ఎంత మేర ఆస్తులు ఉన్నాయి. స్థిర, చర ఆస్తులు, ఇతర వివరాలన్నీ ఇందులో ఉంటాయి. దీన్ని బట్టి ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది.
Similar News
News January 7, 2025
NGKL: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా అందిస్తాం: జూపల్లి
కొల్లాపూర్ మండల పరిధిలోని సింగోటంలోని గ్రామంలో రూ.40 లక్షల ప్రత్యేక అభివృద్ధి నిధులతో ఆధునీకరించిన ప్రాథమిక, జడ్పీహెచ్ఎస్ భవనాలను సోమవారం మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల్లో నాణ్యమైన విద్యా బోధన అందిస్తామని, ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించి మౌలిక వసతులతో వీటిని తీర్చిదిద్దుతామని అన్నారు.
News January 7, 2025
MBNR: బాలికల భద్రతకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్
జిల్లాలోని రెసిడెన్షియల్, కేజీబీవీ పాఠశాలలు, వసతి గృహాలలో బాలికల భద్రతకు అన్నిచర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలు ఆమె మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. డైట్ చార్జీల పెంపునకు అనుగుణంగా కామన్ మెన్ అమలు చేస్తూ నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. వంట గది, పరిసరాల పరిశుభ్రత పాటించాలని ఆమె ఆదేశించారు.
News January 7, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!
✔’జీపీ కార్మికులకు జీతాలు ఇవ్వాలి’:IFTU,PDSU
✔పిల్లలతో నిరసన తెలిపిన ఎస్ఎస్ఏ ఉద్యోగులు
✔ప్రజావాణి..సమస్యలపై ప్రత్యేక ఫోకస్
✔రైతులకు కాంగ్రెస్ మోసం చేసింది:BRS
✔ధరూర్:రేపు భగీరథ నీటి సరఫరా బంద్
✔గ్రంథాలయాల ద్వారా విజ్ఞానం: జూపల్లి
✔MBNR:గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
✔అచ్చంపేట:తమ్ముడిపై కత్తితో దాడి చేసిన అన్న
✔MBNRలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
✔ఉమ్మడి జిల్లాలో పెరిగిన చలి తీవ్రత