News July 25, 2024
MBNR: మీ పిల్లల బడి బస్సుకు ఫిట్ నెస్ ఉందా !

ఉమ్మడి జిల్లాలో ప్రైవేటు పాఠశాల, కళాశాల యాజమాన్యాలు బస్సుల ఫీట్ నెస్ నిర్లక్ష్యంగా వహిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 173 విద్యాసంస్థల బస్సులకు ఫీట్ నెస్ పరీక్షలు చేయించలేదు. 1,339 బస్సులు ఉండగా వీటిలో 1,166 బస్సులకు యాజమాన్యాలు ఫీట్ నెస్ చేయించారు. మిగతా 173 సామర్థ్యం లేని బస్సులు తిరుగుతున్నాయి. ఫిట్ నెస్ లేని బస్సులను సీజ్ చేస్తున్నామని, ఇప్పటికే నోటీసులు ఇచ్చామని రవాణా అధికారి రవి అన్నారు.
Similar News
News November 6, 2025
నేడు పాలమూరులో అభినందన బైక్ ర్యాలీ

పాలమూరుకు యూజీడీ కోసం రూ.821 కోట్లు, తాగునీటి పైప్‌లైన్ కోసం రూ.221 కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ గురువారం ఉదయం 10:30 గంటలకు అభినందన బైక్ ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీ క్యాంపు కార్యాలయం శ్రీనివాస్ కాలనీ నుంచి క్లాక్ టవర్ వరకు సాగుతుందని డీసీసీ జనరల్ సెక్రటరీ అబ్దుల్ సిరాజ్ ఖాద్రి తెలిపారు.
News November 5, 2025
నవాబుపేటలో అత్యధిక వర్షపాతం నమోదు

మహబూబ్ నగర్ జిల్లాల్లో వివిధ ప్రాంతాలలో గడిచిన 24 గంటలు వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది అత్యధికంగా నవాబుపేటలో 30.0 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. మిడ్జిల్ మండలం దోనూరు 21.8, జడ్చర్ల 8.5, మహబూబ్‌నగర్ రూరల్ 4.8, అడ్డాకుల 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
News November 5, 2025
పాలమూరు వర్సిటీకి మరో గౌరవం

పాలమూరు వర్సిటీ విద్యా విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వై.శ్రీనివాస్ “వాలీబాల్ ప్లేయర్స్‌పై డాటా డ్రీవన్ మానిటరింగ్ సిస్టం” అనే అంశంపై యూటిలిటీ పేటెంట్ పొందారు. ఈ మేరకు ఉపకులపతి ప్రొఫెసర్ జి.ఎన్.శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పూస రమేష్ బాబు ఆయనను అభినందించారు. నూతన ఆవిష్కరణల్లో మరింత చురుకుగా పాల్గొనాలని వీసీ కోరారు.


