News April 15, 2025

MBNR: ముఖ్యమంత్రి చేతుల మీదుగా రూ.లక్ష చెక్కు అందజేత

image

దేవరకద్ర మండలం మినిగోనిపల్లి గ్రామానికి చెందిన విజయ ఇటీవల నూతన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో విజయకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు జి.మధుసూదన్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా విజయ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News September 19, 2025

వారంలో మూడు రోజులు ముచ్చింతల్‌కు బస్సులు

image

ఆధ్యాత్మిక కేంద్రం ముచ్చింతల్‌కు వెళ్లేందుకు ఆర్టీసీ అధికారులు బస్సులు ఏర్పాటు చేశారు. ఈ నెల 20 నుంచి శుక్ర, శని, ఆదివారాల్లో బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. JBS, ఆఫ్జల్‌గంజ్‌, సికింద్రాబాద్‌, KPHB, ఉప్పల్‌, రిసాలాబజార్‌ ప్రాంతాల నుంచి బస్సులు నడుపుతామన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ సౌకర్యం ఉంటుందని వివరించారు.  

News September 19, 2025

SRD: ‘ఇన్‌స్పైర్ నామినేషన్లు పూర్తి చేయండి’

image

జిల్లాలో ఇన్‌స్పైర్ నామినేషన్ చేయని పాఠశాలలు చేసే విధంగా రిసోర్స్ పర్సన్లు జిల్లా, డివిజన్, మండల రిసోర్స్ పర్సన్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సంగారెడ్డి డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఈనెల 19, 20 రెండు రోజులు మాత్రమే వర్కింగ్ డేస్ ఉన్నాయని సూచించారు. విద్యార్థులకు సంబంధించిన వివరాలన్నీ తీసుకొని దసరా సెలవుల్లోనూ నామినేషన్ చేయడానికి ప్రయత్నం చేయాలని పేర్కొన్నారు.

News September 19, 2025

జగిత్యాల: ‘వెండికొండలా సోమన్న గుట్ట’

image

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని సోమన్నగుట్ట వెండికొండలా మెరుస్తూ చూపరులను ఆకట్టుకుంటోంది. వరుసగా కురుస్తున్న వర్షాలకు కొండ పైనుంచి నీటిధారలు కిందకి జాలువారుతూ పాలవలే తెల్లగా మెరిసిపోతున్న ఈ అద్భుత దృశ్యం తాజాగా కెమెరాకు చిక్కింది. గుట్ట వెనుక భాగం నుంచి తీసిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.