News November 1, 2024

MBNR: ముమ్మరంగా కురుమూర్తి జాతర ఏర్పాట్లు

image

పేదల తిరుపతి శ్రీ కురుమూర్తి స్వామి జాతరకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు దేవస్థాన సిబ్బందితో పాటు వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు  చేస్తున్నారు. జాతరలో మురుగునీరు నిల్వ ఉండకుండా ఉండేందుకు కాల్వలలో చెత్తను తొలగిస్తున్నారు. ఉద్దాల గుండు వద్ద పిచ్చి మొక్కలను తొలగిస్తూ నేలను చదును చేస్తున్నారు. భక్తులకు మంచినీటి సౌకర్యం పనులను పూర్తి చేస్తున్నారు.

Similar News

News May 8, 2025

మహబూబ్‌నగర్ రూరల్‌లో భార్యను చంపి భర్త ఆత్మహత్య

image

మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం జరిగింది. రూరల్ మండలం బొక్కలోనిపల్లిలో ఓ వ్యక్తి తన భార్యను గొడ్డలితో నరికి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన సరిత (28), రాజేశ్(35) దంపతులు. వీరు దినసరి కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. కుటుంబ కలహాలు, అనుమానంతో మద్యం మత్తులో రాజేశ్ భార్యను గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై, సీఐ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.

తప్పుడు పోస్టులు పెట్టకూడదు: ఎస్పీ

image

దేశంలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సామాజిక మాధ్యమాలలో ఎవరూ తప్పుడు పోస్టులు పెట్టకూడదని మహబూబ్ నగర్ ఎస్పీ జానకి సూచించారు. దేశ సరిహద్దులలో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో ముందస్తు భద్రత చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు 24 గంటలు విధుల్లో ఉంటారన్నారు. పోలీసులకు ప్రస్తుతం సెలవులను రద్దు చేసినట్టు వెల్లడించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు చేయకూడదన్నారు.