News April 4, 2025
MBNR: ముస్లిం మహిళల మేలు కోసమే వక్ఫ్ బోర్డు: ఎంపీ

భారతదేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టం నమోదైందని ఎంపీ డీకే అరుణ తెలిపారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2025కు లోక్ సభ, రాజ్యసభల్లో రాజముద్ర పడిందన్నారు. పేద ముస్లింలు, ముస్లిం మహిళల మేలు కోసం, వక్ఫ్ బోర్డులో పారదర్శకత కోసం ఈ సవరణ బిల్లు ఎంతో దోహదపడుతుందన్నారు. చారిత్రాత్మక నిర్ణయాలను అమలుపరుస్తూ దేశ సంక్షేమం కోసం బీజేపీ ముందుంటుందని అనడానికి ఈ బిల్లు ఆమోదమే ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు.
Similar News
News July 6, 2025
NZB: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పెట్టకుండా చూడాలి

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పెట్టకుండా చూడాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శనివారం ఆయన నిజామాబాద్ కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. నిధులు దుర్వినియోగం అయితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జనాభా ప్రాతిపదికన నిధులు ఖర్చు చేయాలని అధికారులకు సూచించారు.
News July 6, 2025
అనంతగిరిగా మార్చాలని డిమాండ్.. మీ కామెంట్ ?

వికారాబాద్ జిల్లాలో మరో కొత్త డిమాండ్ వినిపిస్తోంది. చుట్టు అడవి, గుట్టమీద అనంత పద్మనాభస్వామి కొలుదీరిన ప్రాంతానికి అనంతగిరి జిల్లాగా పేరు మార్చాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అనంతగిరి గుట్టల ప్రకృతి సోయగాలు, మూసీ నది జన్మస్థలం, ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ఎంతో ప్రసిద్ధి చెందటంతో జిల్లా పేరు మార్చాలని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనిపై మీ కామెంట్.
News July 6, 2025
భద్రాద్రి రామయ్యకు స్వర్ణతులసి పూజలు

శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో స్వామివారి ఉత్సవమూర్తులకు అర్చకులు శనివారం స్వర్ణతులసి పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయ తలుపులు తెరిచి సుప్రభాతం పలికి ఆరాధన, ఆరగింపు, సేవాకాలం, నిత్యహోమాలు, నిత్యబలిహరణం తదితర నిత్యపూజలు చేశారు. స్వామివారి నిత్యకళ్యాణ మూర్తులను బేడా మండపానికి తీసుకువచ్చి నిత్యకళ్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.