News July 16, 2024

MBNR: మూడేళ్లలో 597 మంది మృతి!

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. అయితే వీటిలో అత్యధికంగా జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లోనే ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారు. మూడేళ్ల వ్యవధిలో ప్రధానంగా 565 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆయా ప్రమాదాల్లో 597 మంది మృత్యువాత పడగా.. మరో 1,137 మంది తీవ్ర క్షతగాత్రులు అయ్యారంటే.. ప్రమాదాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

Similar News

News October 16, 2024

ఉమ్మడి MBNR జిల్లాలో నేటి వర్షపాత వివరాలు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా బుధవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా వనపర్తి జిల్లా వీపనగండ్ల 29.5 మి.మీ వర్షపాతం నమోదయింది. నాగర్‌కర్నూల్ జిల్లా ఎళ్లికల్లో 27.8 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా ఉట్కూరులో 26.8 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా కోదండపూర్‌లో 23.8 మిల్లీమీటర్లు, మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల్లో 10.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News October 16, 2024

BREAKING: నాగర్‌కర్నూల్: దంపతుల దారుణ హత్య

image

రంగారెడ్డి జిల్లాలో దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాలు.. కందుకూరు PS పరిధి కొత్తగూడ ఫామ్ హౌస్‌లో దంపతులను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఉషయ్య(55), శాంతమ్మ(50)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 16, 2024

శ్రీశైలానికి 1,23,314 క్యూసెక్కుల వరద

image

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. సుమారుగా 1,23,314 క్యూసెక్కుల వరద వస్తోంది. బుధవారం ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది.శ్రీశైలం ప్రాజెక్ట్ భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో 16.415 ఎం.యూ. విద్యుదుత్పత్తి చేస్తూ 35,315, కుడిగట్టు కేంద్రంలో 15.015 మి.యూ. విద్యుదుత్పత్తి చేస్తూ 30,752 క్యూసెక్కులు మొత్తం 66,067 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.