News August 16, 2024
MBNR: మూడో విడత రుణమాపీ UPDATE
మూడో విడత రుణమాఫీ(రూ.1.5 నుంచి 2 లక్షలు)ని సీఎం రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. దీంతో MBNR జిల్లాలో 11,458 మంది రైతులకు రూ.138.75 కోట్లు, నాగర్‌కర్నూల్‌లో 21,352 మంది రైతులకు 261.36 కోట్లు, గద్వాలలో 9550 మంది రైతులకు 121.91 కోట్లు, వనపర్తిలో 10,047 మందికి రూ.126.63 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. నారాయణపేట జిల్లాలో 3 విడతల్లో మొత్తం 58,754 మంది రైతులకు రూ.503.17కోట్లు మాపీ కానుంది.
Similar News
News September 10, 2024
విష జ్వరాలతో ఇబ్బందులు !
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో డెంగీ, చికెన్ గన్యా, మలేరియా, టైఫాయిడ్, ఇతర విష జ్వరాలతో పాటు, జలుబు,దగ్గు తదితర వాటితో బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. MBNR-30, NGKL-35, NRPT-15, WNPT-15, GDWL-12 చొప్పున ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. వీటన్నిటికీ ఔషధాలు MBNRలోని కేంద్ర ఔషధ నిల్వ కేంద్రం నుంచి సరఫరా అవుతున్నాయి. కొన్ని రకాల ఔషధాలు రోగులకు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
News September 10, 2024
ఉమ్మడి జిల్లాలో “TODAY TOP NEWS”
✔ప్రజావాణి.. సమస్యలపై ఫోకస్ ✔సాహితీ సమరానికి నిలువెత్తు నిదర్శనం కాళోజి:మంత్రి జూపల్లి ✔ఉమ్మడి జిల్లాలో ఘనంగా కాలోజీ జయంతి వేడుకలు ✔రాష్ట్రంలో 80వేల ఎకరాల వక్ఫ్ భూములు:DK అరుణ ✔ఓటు హక్కు నమోదు చేసుకోండి:MROలు ✔అక్రమాలపై హైడ్రా ఫోకస్ ✔డీజేలకు అనుమతి లేదు:SIలు ✔పలుచోట్ల వినాయక నిమర్జనం ✔ప్రజలకు విజ్ఞలు తొలగి విజయం కలగాలి:DIG చౌహన్ ✔ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే శంకర్
News September 10, 2024
జూరాల 26 గేట్లు ఎత్తివేత
జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతోంది. కర్ణాటకలో భారీ వర్షాలు కురవడంతో ఆల్మట్టి డ్యాం పూర్తిస్థాయిలో నిండిపోవడంతో దిగువకు రెండు లక్షలకు పైగా వరద నీరు వదలడంతో జూరాల ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు డ్యాం 26 గేట్లు ఎత్తి 2 లక్షల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. నది తీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.