News March 9, 2025
MBNR: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు నిధులు

రాష్ట్రంలో మరో 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు నిధులు మంజూరు చేస్తూ Dy.CM భట్టి విక్రమార్క ఉత్తర్వులు జారీ చేశారు. వనపర్తి, నారాయణపేట, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, దేవరకద్ర, గద్వాల్, జడ్చర్లలో ఈ స్కూల్స్ నిర్మిస్తున్నారు. ఒక్కో స్కూల్‌కు రూ.200 కోట్ల చొప్పున కేటాయించారు. సువిశాల స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు ధీటుగా నిర్మిస్తున్నామని భట్టి తెలిపారు.
Similar News
News November 21, 2025
తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో<<18346724>> గంటల<<>> వ్యవధిలోనే బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ఉదయం స్వల్పంగా పెరగ్గా.. ఇప్పుడు రూ.500 తగ్గి రూ.1,23,980కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.450 పతనమై రూ.1,13,650 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఉదయం నుంచి ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,61,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 21, 2025
ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్.. ఈ దేశాల్లోనూ చెల్లుబాటు

ఇండియాలో తీసుకున్న డ్రైవింగ్ లైసెన్సులు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఫ్రాన్స్, యూకే, జర్మనీ, స్వీడన్, మలేషియా, స్పెయిన్, కెనడా, నార్వే, ఐర్లాండ్‌లో 6 నెలల నుంచి సంవత్సరం వరకు చెల్లుబాటవుతాయి. అయితే అవి ఇంగ్లిష్‌లో ప్రింట్ అయ్యుండాలి. మారిషస్‌లో ఇండియా డ్రైవింగ్ లైసెన్స్ 24 గంటలు మాత్రమే చెల్లుతుంది. ఇటలీలో మన లైసెన్స్‌తోపాటు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ ఉంటేనే డ్రైవింగ్‌కు అనుమతి ఉంటుంది.
News November 21, 2025
విశాఖ సిటీ పరిధిలో నలుగురు ఎస్ఐల బదిలీ: సీపీ

విశాఖ సిటీ పరిధిలో 4గురు సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ విశాఖ సీపీ శంక బ్రత బాగ్చి శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. దువ్వాడ L&O ఎస్ఐ శ్రీనివాస్‌ను ద్వారాక క్రైమ్‌కు, త్రీటౌన్ L&O ఎస్ఐ సంతోష్‌ను ద్వారక L&Oకు, ద్వారక క్రైమ్ ఎస్ఐ రాజును త్రీటౌన్ L&Oకు, ద్వారక L&O ఎస్ఐ ధర్మేంద్రను దువ్వాడ L&Oకు బదిలీ చేశారు.


