News March 18, 2025
MBNR: యువత దేశం కోసం పాటుపడాలి: VC శ్రీనివాస్

భారత ప్రభుత్వం యువజన సర్వసులు, క్రీడల మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం పాలమూరు యూనివర్సిటీలోని రైబ్రరీ ఆడిటోరియంలో “జిల్లా స్థాయి యువ ఉత్సవ్-2025” ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా V.C Dr.G.N శ్రీనివాస్ మాట్లాడుతూ.. యువత దేశ అభివృద్ధికి పాటుపడుతూ 2047కి ప్రపంచానికి శాసించే విధంగా యువత పాటుపడాలన్నారు. రిజిస్ట్రార్ చెన్నప్ప, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 6, 2025
పోస్టల్ బ్యాలెట్ వినియోగించాలి: కలెక్టర్ రాహుల్ శర్మ

మొదటి విడత ఎన్నికల సిబ్బంది ఈ నెల 6 నుంచొ 8వ తేదీ వరకు ఎంపీడీవో కార్యాలయాల్లోని ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. శనివారం రేగొండ, మొగుళ్లపల్లి, గణపురం, కొత్తపల్లి గోరి మండలాల్లోని రైతు వేదికల్లో జరిగే శిక్షణ కార్యక్రమానికి సిబ్బంది తప్పక హాజరు కావాలని ఆయన ఆదేశించారు.
News December 6, 2025
NLG జిల్లాలో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ఉమ్మడి నల్గొండ జిల్లాలో బిసి., ఇబిసి, ఎస్సి, ఎస్టి అభ్యర్థులకు Awareness programme, IELTS కొరకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎస్పీ రాజ్ కుమార్ తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అర్హులైన అభ్యర్థులు ఈనెల 21లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. website:tgbcstudycircle.cgg.gov.in నందు అన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు.
News December 6, 2025
తొర్రూరు: కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి

స్థానిక ఎన్నికల తరుణంలో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. తొర్రూరు మండలం మడిపల్లికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, సర్పంచ్ అభ్యర్థి వేల్పుల వెంకన్న బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. అనంతరం తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.


