News August 19, 2024
MBNR: రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ డీకే అరుణ
రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని ప్రజలకి ఎంపీ డీకే అరుణ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. అన్నా చెల్లెలు అనుబంధానికి, అప్యాయత అనురాగాలకు ప్రతిక ఈ రాఖీ పండుగ అని గుర్తు చేశారు. ఈ పండుగ మీ అందరి కుటుంబాల్లో మరిన్ని సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. అక్కా చెల్లెలు, అన్నాదమ్ముళ్లు ఆనందోత్సాహాల నడుమ ఈ వేడుక జరుపుకోవాలి అన్నారు.
Similar News
News September 9, 2024
ప్రజలకు విజ్ఞలు తొలగి విజయం కలగాలి: డిఐజి చౌహన్
మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు మొదలుపెట్టిన పనులలో ఎలాంటి విఘ్నాలు లేకుండా.. అన్నింటా విజయం సాధించాలని జోగులాంబ జోన్ -7 డిఐజి ఎల్ఎస్ చౌహాన్ అన్నారు. ఆయన స్థానిక జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలీసు సురక్షా వినాయక విగ్రహంకు జిల్లా ఎస్పీ జానకి, అదనపు ఎస్పీ రాములు లతో గణనాథునికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
News September 9, 2024
రాష్ట్రంలో 80వేల ఎకరాల వక్ఫ్ భూములు: డీకే అరుణ
తెలంగాణ రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు పరిధిలో సుమారు 80వేల ఎకరాల భూములు ఉన్నాయని ఎంపీ డీకే అరుణ అన్నారు. మహబూబ్ నగర్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నిరుపేదలకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డులో సవరణలు చేపట్టిందన్నారు. ఈ విషయంలో కొందరు పనిగట్టుకొని కేంద్రంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అభిప్రాయాలు తెలుసుకునేందుకు రాష్ట్రంలో నెలాఖరున జేపీసీ పర్యటన ఉంటుందన్నారు.
News September 9, 2024
MBNR: అక్రమాలపై ప్రత్యేక హైడ్రా ఫోకస్.!
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో హైడ్రా ప్రకంపనలు మొదలయ్యాయి. CM రేవంత్ రెడ్డి ఆదేశాలతో సర్వే, భూ దస్త్రాల శాఖ అప్రమత్తమైంది. పురపాలక సంఘాల్లో, గ్రామాల్లో చెరువులు, కుంటలు, వాగుల్లో అక్రమ నిర్మాణాలను గుర్తించి ఏ రోజుకు ఆ రోజు నివేదిక రూపంలో సాయంత్రం 4 గంటల వరకు కమిషనర్‌కు మెయిల్ పంపించాలని ఆదేశించారు. నివేదిక ఎలా ఇవ్వాలో నమూనాను కూడా పంపించారు. ఈ ప్రక్రియ ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనుంది.