News April 4, 2025

MBNR: రజతోత్సవ వేడుకల సమావేశంలో ఆర్ఎస్పీ

image

ఏప్రిల్ 27న వరంగల్‌లో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో MBNR బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణకు పొంచి ఉన్న ప్రమాదాలను చక్కగా, ఓపికగా కేసీఆర్ వివరించారన్నారు. భావితరాల భవిష్యత్తును కాపాడడానికి ఎంతటి త్యాగానికైనా వెనకాడరాదని దిశా నిర్దేశం చేశారన్నారు.

Similar News

News April 18, 2025

సంగారెడ్డి జైలులో ఖైదీ మృతి

image

సంగారెడ్డి జిల్లా కందిలోని సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ వెంకట్(39) గుండెపోటుతో మృతి చెందారు. మెదక్ నర్సాపూర్‌కు చెందిన వెంకట్‌ను ఓ కేసులో ఈనెల 3న సెంట్రల్ జైలుకు తీసుకొచ్చారు. ఇవాళ అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో వెంకట్ మరణించినట్లు జైలు అధికారులు ప్రకటించారు. మృతదేహాన్ని సంగారెడ్డిలోని మార్చురీకి తరలించారు.

News April 18, 2025

మంగళగిరిలో ప్రజాదర్బార్ నిర్వహించిన హోం మంత్రి 

image

హోంమంత్రి వంగలపూడి అనిత మంగళగిరి టీడీపీ ఆఫీసులో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్‌లో ప్రజలు తమ సమస్యలను చెప్పుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలు తెలుపుకున్నారు. భూసమస్యలు, పిల్లల విద్యకు సంబంధించి, చెరువుకు సంబంధించిన సమస్యలను అర్జీదారులు హోంమంత్రి వద్ద మొరపెట్టుకున్నారు. ఈ సమస్యలన్నిటినీ వెంటనే పరిష్కరించాలని హోం మంత్రి అధికారులను ఆదేశించారు.

News April 18, 2025

పెంబికి నేషనల్ 4Th Rank.. రూ.కోటి అవార్డ్

image

ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్స్‌లో పెంబి ఉత్తమ స్థానంలో నిలవడానికి కారణాలు ఇవేనని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, పోషకాహారం, వ్యవసాయం, సామాజిక అభివృద్ధి, ప్రాథమిక మౌలిక సదుపాయాలతో పాటు 40 రంగాల పనితీరు ఆధారంగా జాతీయస్థాయిలో 4 ర్యాంక్, మూడవ జోన్‌లో 2వ ర్యాంకు వచ్చిందన్నారు. అలాగే రూ.కోటి అవార్డును గెలుచుకోవడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు.

error: Content is protected !!