News February 26, 2026
MBNR: రాజకీయాలను కుదిపేస్తున్న కుమ్మెర ఘటన

కుమ్మెరలో మల్లన్న జాతర సందర్భంగా తలెత్తిన వివాదం రెండు కులాల మధ్య పంచాయితీగా మారింది. తన రెండు నెలల కుమార్తెను రెడ్డి కులానికి చెందిన వ్యక్తులు కాలితో తన్నడంతో చనిపోయిందని రజక కులానికి చెందిన చిలికేశ్వరం గణేశ్, మౌనిక దంపతులు ఆరోపిస్తున్నారు. రజక కులానికి చెందిన కుటుంబంపై రెడ్డి కులానికి చెందిన వ్యక్తులు చేసిన దాడిలో 2 నెలల పసికందు చనిపోయిందనే వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది.
Similar News
News April 12, 2026
ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు.. నిర్మల్‌కు 12వ స్థానం

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో NRML జిల్లా 62.93% ఉత్తీర్ణతతో 12వ స్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 5,778 మంది పరీక్ష రాయగా, 3,636 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 3,773 మందికి 1,391 మంది (36.87%) పాస్ అయ్యారు. బాలికలు 3,928 మందికి గాను 2,519 మంది (64.13%) ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు. ఒకేషనల్‌లో 873 మంది పరీక్ష రాయగా 469 మంది విద్యార్థులు పాసై 53.72శాతంతో స్టేట్‌లో 29వ స్థానంలో నిలిచింది.
News April 12, 2026
ఇంటర్ సెకండియర్ RESULTS.. మెదక్ 26వ స్థానం

ఇంటర్ 2ndఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. మెదక్(D)లో రెగ్యులర్ విద్యార్థులు 4826 మంది పరీక్షలు రాయగా 3310 మంది పాసై 68.59 శాతంతో స్టేట్‌లోనే 26వ స్థానం వచ్చింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 539 మందికి 460మంది పాసై 85.34 శాతంతో 3వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 649 మందికి 187 మంది పాసై 28.81%తో 28వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో16 మందికి 11 మంది పాసై 68.75%తో 1వ ప్లేస్ వచ్చింది.
News April 12, 2026
ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు.. భూపాలపల్లికి మూడో ర్యాంక్

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. భూపాలపల్లి జిల్లాలో రెగ్యులర్ ఫస్టియర్ విద్యార్థులు 1454 మంది పరీక్ష రాయగా 1062 మంది పాసై 73.04 శాతంతో స్టేట్‌లో మూడో ర్యాంక్‌లో నిలిచింది. ఇక ఒకేషన్‌లో 290 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 197 మంది విద్యార్థులు పాసై 67.93 శాతంతో స్టేట్‌లో 8వ స్థానంలో నిలిచింది.


