News February 1, 2025
MBNR: రిజర్వాయర్లో పడి చిన్నారులు మృతి
జడ్చర్ల మండలం ఉదండాపూర్ రిజర్వాయర్లో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన జడ్చర్ల మండలంలో జరిగింది. గ్రామస్థుల వివరాలు.. ఉదండాపూర్ గ్రామానికి చెందిన యాదయ్యకు ఉదండాపూర్ రిజర్వాయర్ పక్కన వ్యవసాయ పొలం ఉంది. వారి ఇద్దరు పిల్లలు భాగ్యలక్ష్మి(7), మహేష్(4) శనివారం పొలానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు ప్రాజెక్టు నీటిని గుంతలో పడడంతో మహేష్ మృతదేహం లభించింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News February 2, 2025
తాడ్వాయి: భక్తుల స్నానాల కోసం జంపన్న వాగులో షవర్ల ఏర్పాటు
తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారక్క దర్శనానికి వచ్చే వారి సౌకర్యార్థం వివిధ శాఖలు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నాయి. కొద్ది రోజుల్లో మేడారం చిన్న జాతర ఉండడంతో భక్తులు పుణ్యస్నానాలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం జంపన్న వాగులో రెండు ఊట బావులను పూడిక తీసి వాగుకు ఇరువైపుల ఉన్న స్నాన ఘట్టాలకు షవర్లు బిగించారు.
News February 2, 2025
MNCL: రోజూ 2.6లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలి: CMD
పెరుగుతున్న విద్యుత్ అవసరాల దృష్ట్యా థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ప్రతిరోజు 2.6లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని సంస్థ CMD బలరాం ఆదేశించారు. శనివారం అన్ని ఏరియాల GMలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రోజుకు 11రేకులకు తగ్గకుండా బొగ్గు సరఫరా చేయాలన్నారు. బొగ్గు ఉత్పత్తి సాధనలో నాణ్యతకు, రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
News February 2, 2025
సంగారెడ్డి: ముగిసిన బడి బయట పిల్లల సర్వే
సంగారెడ్డి జిల్లాలో జనవరి 11 నుంచి సీఆర్పీలు, ఐఈఆర్పీలు నిర్వహించిన బడి బయట పిల్లల సర్వే శనివారంతో ముగిసిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. బడి బయట పిల్లల సర్వేలో గుర్తించిన పిల్లల వివరాలను ప్రభంధ పోర్టల్ వెబ్సైట్లో నమోదు చేయాలని సీఆర్పీలకు, ఐఈఆర్పీలకు సూచించారు.