News February 1, 2025

MBNR: రిజర్వాయర్‌లో పడి చిన్నారులు మృతి

image

జడ్చర్ల మండలం ఉదండాపూర్ రిజర్వాయర్‌లో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన జడ్చర్ల మండలంలో జరిగింది. గ్రామస్థుల వివరాలు.. ఉదండాపూర్ గ్రామానికి చెందిన యాదయ్యకు ఉదండాపూర్ రిజర్వాయర్ పక్కన వ్యవసాయ పొలం ఉంది. వారి ఇద్దరు పిల్లలు భాగ్యలక్ష్మి(7), మహేష్(4) శనివారం పొలానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు ప్రాజెక్టు నీటిని గుంతలో పడడంతో మహేష్ మృతదేహం లభించింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News April 19, 2026

చిత్తూరు: చెరువులో పడి ఇద్దరు మహిళలు మృతి

image

గుడిపల్లి (M) కనుమనపల్లిలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో గుడ్డలు ఉతికేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు బేబీ (19), దుర్గ (21) మృతి చెందారు. వరుసకు అక్క చెల్లెలు అయిన బేబీ, దుర్గ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

News April 19, 2026

అల్లికలతో వ్యసనాలకు చెక్!

image

స్మోకింగ్, గోళ్లు కొరకడం, గంటల తరబడి మొబైల్ చూడటం వంటి వ్యసనాల నుంచి బయటపడటానికి అల్లికలు మంచి మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఖర్చుతో కూడిన థెరపీలు, కౌన్సెలింగ్‌లు అవసరం లేదంటున్నారు. ‘అల్లికలు అందంగా ఉండనక్కర్లేదు. చేతులు, కళ్ల కదలికల వల్ల పారాసింపథెటిక్ నెర్వస్ సిస్టమ్ యాక్టివేటై శరీరం రిలాక్స్ అవుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. అల్జీమర్స్, డిమెన్షియా వంటి సమస్యలూ తగ్గుతాయి’ అని పేర్కొంటున్నారు.

News April 19, 2026

రేపు యథావిధిగా ‘మీకోసం’: కలెక్టర్‌

image

అమలాపురంలో సోమవారం పీజీఆర్ఎస్ మీకోసం, రెవెన్యూ క్లినిక్ యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదివారం తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల కేంద్రంలో మీకోసం కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తారన్నారు. అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేసుకుని పరిష్కార మార్గాలు పొందాలన్నారు.