News September 2, 2024
MBNR: రూ.13కోట్లతో సిద్ధమవుతున్న సింథటిక్ ట్రాక్!

PUలో 2 ఎకరాల స్థలంలో పరుగు మార్గం (సింథటిక్ ట్రాక్) ఏర్పాటు చేశారు. 800 Mts,100Mts పరుగు పోటీలకు అనుగుణంగా నిర్మించారు. మార్గంలో 8 మంది క్రీడాకారులు సమాంతరంగా పరిగెత్తే వీలుంది. 2023లో కేంద్ర ప్రభుత్వం ‘ఖేలో ఇండియా పథకం’ కింద పరుగు మార్గం నిర్మాణానికి రూ.9 కోట్లు, రూ.4 కోట్లతో చేపట్టే క్రీడాకారులు దుస్తులు మార్చుకునే 6 గదులు, ప్రేక్షకులు కూర్చునేందుకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేస్తున్నారు.
Similar News
News October 22, 2025
కన్నుల పండువగా కురుమూర్తి స్వామి కళ్యాణ మహోత్సవం

శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో కమనీయంగా జరిగింది. వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛారణ మధ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. కురుమూర్తి స్వామి గిరులు “కురుమూర్తి వాసా గోవింద” నామ స్మరణతో మార్మోగాయి.
News October 22, 2025
రేపు కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల కోఆర్డినేషన్ మీటింగ్

కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రేపు కోనేరు వద్ద ఉన్న కళ్యాణ మండపంలో అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయితో పాటు దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి కూడా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జాతరకు సంబంధించిన ఏర్పాట్లు సహా తదితర ముఖ్య అంశాలపై సమీక్షించనున్నారు.
News October 21, 2025
పాలమూరు వర్శిటీ.. దేశవ్యాప్తంగా వినిపించాలి:VC

పాలమూరు వర్శిటీ పేరు దేశవ్యాప్తంగా వినిపించేలా పథకాలు సాధించాలని వర్శిటీ ఉపకులపతి ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆర్చరీ పురుషుల జట్టుకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. సౌత్ జోన్(ఆల్ ఇండియా ఇంటర్ వర్శిటీ) టోర్నమెంట్లో పాల్గొనేందుకు ఆర్చరీ జట్టు గురుకాసి వర్శిటీ పంజాబ్కు బయలుదేరారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.రమేష్ బాబు, అసోసియేట్ ప్రొ.డాక్టర్ ఎన్.కిషోర్,PD శ్రీనివాసులు పాల్గొన్నారు.